గ్లోబల్ సూపర్ పవర్ గా భార‌త్.. : ఆఫ్రికన్ యూనియన్ ఛైర్‌పర్సన్ అజాలి

Published : Sep 11, 2023, 11:17 AM IST
గ్లోబల్ సూపర్ పవర్ గా భార‌త్.. : ఆఫ్రికన్ యూనియన్ ఛైర్‌పర్సన్ అజాలి

సారాంశం

G20 India: రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సమావేశం ప్రారంభ సమావేశంలో ప్రధాని మోడీ సెప్టెంబర్ 09 న ఆఫ్రికా యూనియన్ ను జీ20లో శాశ్వత సభ్యదేశంగా భారతదేశం అధ్యక్షతన చేర్చినట్లు ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం ప్రధాని మోడీ తన ఆనందాన్ని పంచుకుంటూ గ్లోబల్ సౌత్ అభివృద్ధికి సాధ్యమైనంత వరకు కృషి చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ ప్రకటన తర్వాత భావోద్వేగానికి లోనైనట్లు ఏయూ చైర్ పర్సన్ అజాలీ అసోమాని తెలిపారు.  

Comoros President Azali Assoumani: జీ20 స‌మ్మిట్ స‌క్సెస్ తో యావ‌త్ ప్ర‌పంచ దేశాలు ఇప్పుడు భార‌త్ వైపు చూస్తున్నాయ‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీనికి ఇటీవ‌ల భార‌త్ గ్లోబ‌ల్ లీడ‌ర్ గా ఎద‌గ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను కార‌ణంగా చూపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆఫ్రిక‌న్ యూనియ‌న్ చీఫ్ ఇప్పుడు భార‌త్ సూప‌ర్ ప‌వ‌ర్ గా మారింద‌ని చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.  రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సమావేశం ప్రారంభ సమావేశంలో ప్రధాని మోడీ సెప్టెంబర్ 09 న ఆఫ్రికా యూనియన్ ను జీ20లో శాశ్వత సభ్యదేశంగా భారతదేశం అధ్యక్షతన చేర్చినట్లు ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం ప్రధాని మోడీ తన ఆనందాన్ని పంచుకుంటూ గ్లోబల్ సౌత్ అభివృద్ధికి సాధ్యమైనంత వరకు కృషి చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ ప్రకటన తర్వాత భావోద్వేగానికి లోనైనట్లు ఏయూ చైర్ పర్సన్ అజాలీ అసోమాని తెలిపారు.

భారత్ సూపర్ పవర్ అని కొమోరోస్ అధ్యక్షుడు అజాలి అసోమానీ కొనియాడారు. భారత్, కొమొరోస్ మధ్య ఉన్న సత్సంబంధాలను ఆయన ఎత్తిచూపుతూ భవిష్యత్ సంబంధాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ నేతల శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందింది. జీ20లో ఆఫ్రికా యూనియన్ కు పూర్తి సభ్యత్వం కల్పించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ వాదించారు, ఈ ప్రతిపాదనకు కీలక ప్రపంచ దేశాల నుండి మద్దతు లభించింది. జనాభా పరంగా భారత్ సూపర్ పవర్ అనీ, ఇప్పుడు చైనా కంటే ముందంజలో ఉందని కొమొరోస్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ ప్రస్తుత చైర్ పర్సన్ అజాలి అసోమానీ ఆదివారం అన్నారు.

జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన అసోమానీ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-కొమొరోస్ సంబంధాల భవిష్యత్తు గురించి అడిగినప్పుడు, "ఇది మంచి భవిష్యత్తు. భారత్ తో మాకు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. శతాబ్దాలుగా భారతీయులు కొమొరోస్ లో ఉన్నారని నాకు గుర్తుంది. వారు వ్యాపారం చేస్తున్నారనీ, అక్కడ నివసిస్తున్న భారతీయులతో తమకు ఎలాంటి సమస్య లేద"న్నారు. భారత్ ప్రపంచంలో ఐదో అగ్రరాజ్యమనీ, అందువల్ల ఆఫ్రికాలో భారత్ కు తగినంత అవకాశం ఉందన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన భారత్ ఎంత శక్తిమంతమైనదనే విషయం మనకు తెలిసిందే. కాబట్టి, మన అవకాశాలను సమన్వయం చేసుకోవాల"న్నారు. 

అలాగే, ఆఫ్రికన్ యూనియన్ ను జీ20లో అధికారికంగా చేర్చిన తర్వాత మోడీ తనను కౌగిలించుకున్న క్షణం గురించి అసుమానీ మాట్లాడుతూ..  "నేను ఏడవబోతున్నాను. ఇది నాకు గొప్ప భావోద్వేగం. ఎందుకంటే వాస్తవానికి దీనిపై చర్చ జరుగుతుందని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని భావించామని, అయితే సదస్సు ప్రారంభంలోనే తాము సభ్యదేశంగా ఉన్నామని ప్రకటించారని" చెప్పారు. ఆదివారం అసుమానీతో సమావేశమైన మోడీ ఆఫ్రికా కూటమి జీ20లో చేరడంపై అభినందనలు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!