INDIA Alliance: ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికలకు కాదు.. లోక్ సభ ఎన్నికలకే: కాంగ్రెస్

By Mahesh K  |  First Published Feb 2, 2024, 6:43 PM IST

ఇండియా కూటమికి ఢోకా లేదని, ఈ కూటమి కొనసాగుతున్నదని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేశ్ తెలిపారు. ఈ కూటమి అసెంబ్లీ ఎన్నికలకు వర్తించదని, కేవలం లోక్ సభ ఎన్నికల్లోనే కూటమిలోని 27 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వివరించారు.
 


Congress: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూటమి మార్చడంతో ఇండియా కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. మమతా బెనర్జీ తెగదెంపులు చేసుకోవడం, ఆప్ కూడా అదే బాటలో వెళ్లడంతో ఇండియా కూటమి అటకెక్కిందని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిపై కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్ పశ్చిమ బెంగాల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమికి కొనసాగుతుందని స్పష్టం చేశారు. జేడీయూ వెళ్లిపోయాక ఈ కూటమిలోని పార్టీల సంఖ్య 27కు పడిపోయింది. ఈ 27 పార్టీలు కలిసి కట్టుగా లోక్ సభ ఎన్నికల్లో పోరాడుతాయని స్పష్టత ఇచ్చారు.

కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ఎంతో ప్రయోజనకరమైనదని వివరించారు. ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమమే, ఎన్నికల క్యాంపెయిన్ కాదని చెప్పారు. అయినా.. ఇది లోక్ సభ ఎన్నికల్లో తమ కూటమికి ఎంతో ఉపకరిస్తుందని వివరించారు.

Latest Videos

Also Read: Thalapathy Vijay: పవన్ కళ్యాణ్, విజయ్‌లది ఒకే దారి!.. సేమ్ టు సేమ్!!

ఇండియా కూటమి లోక్ సభ ఎన్నికల కోసమే అని, అసెంబ్లీ ఎన్నికలతో ఈ కూటమికి సంబంధం ఉండదని వివరించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు, మహారాష్ట్ర, ఇతర ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ కూటమి వర్తించదని తెలిపారు. మహారాష్ట్రలో తాము ఎన్సీపీ, శివసేనలతో కలిసే పోటీ చేస్తామని, కానీ, మిగిలిన రాష్ట్రాల్లో ఇండియా కూటమి మిత్రపక్షాలతోనే పొత్తులో పోటీ చేయాలనేమీ లేదని పేర్కొన్నారు. కానీ, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం 27 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని బీర్భమ్ జిల్లాలోని రామపుర్హత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

click me!