జ్ఞాన్ వాపి కేసు (Gyanvapi case) లో ముస్లిం వర్గానికి అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court)లో చుక్కెదురైంది. జ్ఞాన్ వాపి మసీదు సముదాయం (Gyanvapi complex)లోని మూసివేసిన బేస్మేంట్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చని తెల్చి చెప్పింది.
జ్ఞాన్ వాపి మసీదు సముదాయంలోని మూసివేసిన బేస్మేంట్ లో హిందూ భక్తులను ప్రార్థనలు, పూజలు చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు తెల్చి చెప్పింది. అక్కడ పూజలకు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పిటిషన్ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును గురువారం ఆశ్రయించింది. అయితే దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు.. పూజలు నిలిపివేయలేమని తెలిపింది.
రాజ్యసభలో నిద్రపోయిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.. వీడియో వైరల్..
జ్ఞానవాపి మసీదు ఆవరణలో, వెలుపల శాంతిభద్రతలను కాపాడాలని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తో కూడిన సింగిల్ బెంచ్ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. వాస్తవానికి జ్ఞాన్ వాపి మసీదు దక్షిణ సెల్లార్ లో పూజలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిని సవాలు చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును గురువారం ఆశ్రయించింది. కానీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది.
బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైన మాజీ ఎంపీ గోడం నగేష్..?
దీంతో మసీదు కమిటీ గురువారం అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా ఈ తీర్పు వెలువడింది. ఇదిలా ఉండగా వారణాసి కోర్టు జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష్ ఆదేశాల మేరకు జ్ఞాన్ వాపిలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో గురువారం కావడంతో ముస్లిం వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ పూజలకు నిరసనగా బనారస్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో శుక్రవారం దుకాణాలను పూర్తిగా మూసివేయాలని అంజుమన్ అరేంజ్ మెంట్ మసీదు కమిటీ విజ్ఞప్తి చేసింది.
మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
దీంతో ఎప్పుడూ అడుగు పెట్టలేనంత రద్దీగా మార్కెట్ లు కూడా నిశ్వబ్దంగా మారాయి. దాల్మండి, నై సడక్, బెనియాబాగ్, మదన్‌పురా, బడి బజార్, బజార్దిహా, పురానా పుల్, సారయ్యతో సహా వారణాసిలోని అనేక ముస్లిం ప్రాంతాలలో దుకాణాలు మూసివేశారు. ముస్లిం సమాజం ప్రకటించిన బంద్ నేపథ్యంలో అడ్మినిస్ట్రేటివ్ కూడా అలెర్ట్ అయ్యింది. వారణాసిలోని ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు, పీఏసీ బృందాలు కూడా నిరంతరం గస్తీ కాస్తున్నాయి. మరోవైపు జ్ఞాన్ వాపికి వెళ్లే రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.