తిడుతున్న‌ద‌ని రైఫిల్ లో కాల్చి.. క‌న్నత‌ల్లి ప్రాణాలు తీసిన యువ‌కుడు..

Published : Jan 18, 2023, 01:47 PM IST
తిడుతున్న‌ద‌ని రైఫిల్ లో కాల్చి.. క‌న్నత‌ల్లి ప్రాణాలు తీసిన యువ‌కుడు..

సారాంశం

Tikamgarh: త‌న‌ను తరచూ తిట్టడంతో పాటు కొడుతున్న‌ద‌నే కార‌ణంతో ఒక టీనేజ్ బాలుడు కోపంలో తన తల్లిని కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. తన తండ్రి లైసెన్స్ డ్ రైఫిల్ తో ఈ దారుణానికి ఒడిక‌ట్టాడ‌ని ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్ల‌డించారు.   

teenage boy shoots dead his mother: మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌న త‌ల్లి త‌న‌ను త‌ర‌చూ తిట్ట‌డంతో పాటు కొడుతున్న‌ద‌నే కార‌ణంతో ఓ యువ‌కుడు త‌న క‌న్న‌త‌ల్లిని కాల్చి చంపాడు. తన తండ్రి లైసెన్స్ డ్ రైఫిల్ తో ఈ దారుణానికి ఒడిక‌ట్టాడ‌ని ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్ల‌డించారు.  ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత‌లోతుగా విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. పలుమార్లు తనను తిట్టినందుకు, కొట్టినందుకు కోపంతో 16 ఏళ్ల బాలుడు తన తల్లిని కాల్చి చంపాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని టాక‌మ్ గ‌ఢ్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 11వ తరగతి చదువుతున్న బాలుడు తన తండ్రి లైసెన్స్ డ్ రైఫిల్ తో ఇంట్లో ఉన్న 43 ఏళ్ల తల్లిపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న అతని తండ్రి ఆ సమయంలో ఇంట్లో లేరు. అత‌ని లైసెన్స్ డ్ రైఫిల్ తో ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. 

నేరం చేసిన తర్వాత యువకుడు పోలీసులకు సమాచారం అందించాడనీ, వారు సంఘటనా స్థలానికి వచ్చే వరకు వేచి చూశారని అధికారులు తెలిపారు. తల్లి తన పట్ల అనుసరిస్తున్న వైఖరిపై బాలుడు అసంతృప్తితో ఉన్నాడనీ, అప్పుడప్పుడు తనను తిట్ట‌డంతో పాటు తీవ్రంగా కొట్టేద‌ని తెలిపాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఈ ప‌రిస్థితులు అతనికి చాలా కోపం తెప్పించిందనీ, ఈ క్ర‌మంలోనే కాల్పులు జ‌రిపిన‌ట్టు రూరల్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ప్రీతి భార్గవ ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ చెప్పారు. హత్య కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu