బ‌తికుండ‌గా వ‌ద్ద‌న్నారు.. చ‌చ్చాక ఇద్ద‌రికీ పెండ్లి చేశారు.. అంతులేని ప్రేమ‌క‌థ !

By Mahesh RajamoniFirst Published Jan 18, 2023, 1:25 PM IST
Highlights

Tapi: కుటుంబ సభ్యులు తమ వివాహానికి అంగీకరించకపోవడంతో ఇద్ద‌రు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, వారి మ‌ర‌ణం త‌ర్వాత ఇరు కుటుంబాలు పశ్చాత్తాపంతో కుంగిపోయారు. వారు మ‌ర‌ణించిన ఆరు నెలల తరువాత, వారి కుటుంబాలు వారి కోరికను నెరవేర్చారు.. ఇద్ద‌రికి పెండ్లి చేశారు. వారి విగ్ర‌హాల‌తో వివాహం జ‌రిపించారు. ఈ అంతులేని ప్రేమ‌క‌థ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.
 

lovers statues wedding: కుటుంబ సభ్యులు తమ వివాహానికి అంగీకరించకపోవడంతో ఇద్ద‌రు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, వారి మ‌ర‌ణం త‌ర్వాత ఇరు కుటుంబాలు పశ్చాత్తాపంతో కుంగిపోయారు. వారు మ‌ర‌ణించిన ఆరు నెలల తరువాత, వారి కుటుంబాలు వారి కోరికను నెరవేర్చారు.. ఇద్ద‌రికి పెండ్లి చేశారు. వారి విగ్ర‌హాల‌తో వివాహం జ‌రిపించారు. ఈ అంతులేని ప్రేమ‌క‌థ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

వివ‌రాల్లోకెళ్తే.. గుజరాత్‌లో ఒక విచిత్రమైన ప్రేమ కథ వెలుగులోకి వ‌చ్చింది. అక్కడ ఒక కుటుంబం ఒక జంట మరణించిన ఆరు నెలల తర్వాత వారి విగ్రహాలకు వివాహం చేసింది. వారి బ‌తికుండాగా ఒప్పుకోని కుటుంబాలు ప్రేమికులు మ‌ర‌ణించిన త‌ర్వాత పశ్చాత్తాపంతో వారి విగ్ర‌హాల‌కు వివాహం చేశారు. కుటుంబ సభ్యులు తమ వివాహానికి అంగీకరించకపోవడంతో ఆశలు వదులుకున్న ఇద్ద‌రు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆగష్టు 2022న గుజరాత్‌లోని తాపిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గణేష్-రంజనలను వారి కుటుంబ సభ్యులు వారి ప్రేమ‌ను అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రూఉరివేసుకుని బ‌ల‌వంతంగా ప్రాణాలు తీసుకున్నారు.

ఈ సంఘటన తర్వాత, వారి కుటుంబాలు వారు జీవించి ఉన్నప్పుడు కలిసి ఉండలేకపోయారని భావించారు. వారి ప్రేమ‌ను అంగీక‌రించ‌కుండా.. ప్రేమికుల ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మ‌య్యామ‌ని  పశ్చాత్తాపం చెందాను. ఈ క్ర‌మంలోనే ప్రేమికుల విగ్ర‌హాల‌ను త‌యారు చేయించారు. అన్న ఆచారాలను అనుసరించి వారి విగ్ర‌హాల‌కు వివాహం చేశారు. ఆ అబ్బాయి మా దూరపు కుటుంబానికి చెందిన వాడనీ, అందుకే పెళ్లికి సిద్ధపడడం లేదని అమ్మాయి తాత భీంసింగ్ పద్వీ తెలిపారు. అయితే వారిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నార‌నీ, అందుకే వారి ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ప్రాణాలు తీసుకున్నార‌ని చెప్పారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు ఈ నిర్ణ‌యానికి వ‌చ్చాయ‌ని చెప్పారు. వారి కోరికలు తీర్చేందుకు, వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ పని చేశామని కుటుంబీకులు తెలిపారు. అందుకే సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా వివాహం జ‌రిపించిన‌ట్టు చెప్పారు. 
 

click me!