యువతులకు తెలియకుండా బాత్ రూమ్, బెడ్ రూమ్ లలో స్పై కెమెరాలు పెట్టిన ఇంటి ఓనర్.. వారి వీడియోలను చూస్తూ..

By Asianet NewsFirst Published May 2, 2023, 9:37 AM IST
Highlights

ఇంట్లో అద్దెకు ఉండే విద్యార్థిణుల అశ్లీల దృశ్యాలు చూడాలనే ఉద్దేశంతో ఓనర్ స్పై కెమెరాలు అమర్చాడు. కొన్ని రోజలు తరువాత ఈ విషయం అమ్మాయిలకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

అతడు ఓ ఐటీ నిపుణుడు. టెక్నాలజీపై మంచి పట్టు ఉంది. కానీ ఓ పాడుబుద్ధి కలిగింది. తనకు ఉన్న ఇళ్లను యువతులకు అద్దెకు ఇచ్చి, వారికి తెలియకుండానే బాత్ రూమ్, బెడ్ రూమ్ లలో స్పై కెమెరాలు బిగించాడు. వారి వీడియోలను చూస్తూ ఉండేవాడు. కానీ ఒక రోజు ఈ విషయంలో గదిలో అద్దెకు ఉండే అమ్మాయిలకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

బ్రేకింగ్ : తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా హతం.. ప్రత్యర్థి ముఠా దాడి చేయడంతో ఘటన

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన రాజేంద్ర సోనీ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ లో డిగ్రీ చేశారు. స్వయంగా ఐటీ నిపుణుడైన ఆయన సీసీ కెమెరాలు, కంప్యూటర్ల వ్యాపారం చేస్తుంటాడు. దీంతో అతడికి సీసీ కెమెరాలు, స్పై కెమెరాలు అమర్చడం వంటి పలు అంశాలపై పూర్తి అవగాహన ఉంది. అయితే అతడికి ఉదయపూర్ లో సొంతంగా ఫ్లాట్ లు ఉన్నాయి. ఆ నగరానికి వివిధ ప్రదేశాల నుంచి ఎంతో మంది చదువుకునేందుకు వస్తుంటారు. అక్కడే ఫ్లాట్ లు అద్దెకు తీసుకొని ఉంటారు. 

హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే కాల్చి చంపేస్తాం - కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇలా పలు ప్రదేశాల నుంచి ఉదయపూర్ కు వచ్చిన విద్యార్థినులకు 8 నెలల కిందట తన ఫ్లాట్ లను అద్దెకు ఇచ్చాడు. అయితే సెలవుల్లో వారు ఇంటికి వెళ్లినప్పుడు తన వద్ద ఉన్న డూప్లికేట్ తలం చెవితో ప్లాట్ లోకి ప్రవేశించాడు. బాత్ రూమ్ లలో, బెడ్ రూమ్ లలో స్పై కెమెరాలు ఇన్ స్టాల్ చేశాడు. తరువాత ఫ్రీ వైఫ్ అందిస్తాననే నెపంతో ఆ ఫ్లాట్ లో వైఫై రూటర్ కూడా పెట్టించాడు. ఇక అప్పటి నుంచి తన ఇంటి నుంచే ఆ ఫ్లాట్ లో అమ్మాయిలు చేసే పనులన్నీ చూసేవాడు. బాత్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో కూడా వారి దృశ్యాలను వీక్షించేవాడు. 

ఈ క్రమంలో ఒక రోజు ఆ ప్లాట్ లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఆ విద్యార్థినులు ఎలక్ట్రీషియన్ ను పిలిపించారు. అతడు రిపేర్ చేస్తున్న క్రమంలో ఈ స్పై కెమెరాలు భయటపడ్డాయి. వాటిని చూసిన ఆ యువతులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయం అంతా చెప్పి ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని ఏప్రిల్ 27వ తేదీన అరెస్టు చేశారు.

కాకినాడలో విషాదం.. ఆడుకుంటూ కారులోకి వెళ్లిన చిన్నారి.. డోర్ లాక్ అవడంతో ఊపిరాడక మృతి

అమ్మాయిల వీడియోలు చూడాలనే ఉద్దేశంతోనే స్పై కెమెరాలు ఏర్పాటు చేశానని నిందితుడు రాజేంద్ర సోనీ విచారణలో అంగీకరించాడు. పోలీసులు అతడి నుంచి స్పై కెమెరాలు, ఇంటర్నెట్ రూటర్, ఫ్లాట్ డూప్లికేట్ తాళాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సోమవారం కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అతడికి మే 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

click me!