బ్రేకింగ్ : తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా హతం.. ప్రత్యర్థి ముఠా దాడి చేయడంతో ఘటన

Published : May 02, 2023, 08:57 AM IST
బ్రేకింగ్ : తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా హతం.. ప్రత్యర్థి ముఠా దాడి చేయడంతో ఘటన

సారాంశం

తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా మరణించాడు. ఈరోజు తెల్లవారుజామున ప్రత్యర్థి ముఠా సభ్యులు అతడిపై రాడ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలతో అతడు చనిపోయాడు. 

ఢిల్లీ రోహిణి కోర్టులో కాల్పల ఘటనలో నిందితుడు, గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా హతమయ్యాడు. ప్రస్తుతం తీహార్ లోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న అతడిపై ప్రత్యర్థి ముఠా సభ్యులు దాడి చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అతడిని హాస్పిటల్ కు తరలించారని, కానీ అప్పటికే మరణించాడని డాక్టర్లు పేర్కొన్నారని జైలు అధికారులు తెలిపారు. 

తీహార్ జైలులో గ్యాంగ్ స్టర్ యోగేష్ తుండా, అతడి అనుచరులు టిల్లు తాజ్ పురియా అలియాస్ సునీల్ మాన్ పై ఈ రోజు తెల్లవారుజామును ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారని అధికారులు చెప్పారు. అయితే అతడిని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాగా.. అతడు 2021లో రోహిణి కోర్టు షూటౌట్ కేసులో తాజ్‌పురియా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !