అమిత్‌షాకు కరోనా: స్వీయ నిర్భంధంలోకి ఐటీ మంత్రి రవిశంకర్

By narsimha lodeFirst Published Aug 3, 2020, 2:34 PM IST
Highlights

కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. ఈ నెల 1వ తేదీన రవిశంకర్ ప్రసాద్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. 

న్యూఢిల్లీ: కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. ఈ నెల 1వ తేదీన రవిశంకర్ ప్రసాద్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. 

ఈ నెల 2వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని  అమిత్ షా  కేంద్ర మంత్రి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఢిల్లీలోని గురుగ్రామ్ లోని  ఓ ఆసుపత్రిలో అమిత్ షా చేరారు. అమిత్ షా డయాబెటిక్ పేషేంట్. కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన  పరీక్షలు చేయించుకొన్నాడు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది.దీంతో తనను కలిసిన వారంతా ఐసోలేషన్ లో ఉండాలని అమిత్ షా సూచించారు. అంతేకాదు కరోనా పరీక్షలు కూడ చేయించుకోవాలని ఆయన సూచించారు.

also read:కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా

దీంతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. శనివారం నాడు మరో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కూడ అమిత్ షా ను కలిశారు. షాకు కరోనా సోకిందని తేలడంతో సుప్రియో కూడ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు.

శనివారం నాడు అమిత్ షా ఇంటర్నేషనల్ వెబినార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  షా త్వరగా కోలుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, హర్సిమత్ కౌర్, విజయ్ రూపానీ, జితేంద్ర సింగ్ తదితరులు కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టుగా ప్రకటించారు.


 

click me!