దేశంలో కరోనా కరాళనృత్యం: 18 లక్షలను దాటిన కేసులు

By team telugu  |  First Published Aug 3, 2020, 10:51 AM IST

రుసగా 5వ రోజు కూడా 50వేల కేసులు నమోదయ్యాయి. నిన్నొక్కరోజే 54,735 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 18,03,696 కు చేరుకుంది.


భారతదేశంలో 17 లక్షల మార్కును కరోనా కేసులు దాటిన రెండు రోజులకే నేడు 18 లక్షల మార్కును కూడా దాటేశాయి. వరుసగా 5వ రోజు కూడా 50వేల కేసులు నమోదయ్యాయి. నిన్నొక్కరోజే 54,735 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీనితో మొత్తం కేసుల సంఖ్య 18,03,696 కు చేరుకుంది. కరోనా బారినపడి కోలుకున్నవారి సంఖ్య కూడా 11 లక్షలను దాటింది. 11,86,203 మంది ఈ వైరస్ బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతానికి 5,79,357 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 

Latest Videos

undefined

నిన్నొక్కరోజే 771 మంది మరణించడంతో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి మరణించినవారి సంఖ్య 38,135 మందికి చేరింది. రికవరీ రేటు 65 శాతానికన్నా ఎక్కువగా ఉండగా, మరణాల రేటు సైతం 2.13 శాతానికి పడిపోయింది. 

ఇకపోతే... తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు ప్రజలకు గత 24 గంటల్లో కరోనా వైరస్ కొంత ఊరటనిచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో గత 24 గంటల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గాయి. నిన్న 273 కేసులు మాత్రమే హైదరాబాదులో నమోదయ్యాయి. 

రంగారెడ్డి, వరంగల్ అర్భన్, మేడ్చెల్ జిల్లాల్లో కూడా కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 983 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులసంఖ్య 67,660కి చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 11 మంది కరోనా వైరస్ తో మరణించారు. 

దీంతో మొత్తం మరణాల సంఖ్య 551కి చేరుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16, జగిత్యాల జిల్లాలో 13, జనగామ జిల్ాలలో 13, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12, జోగులాంబ గద్వాల జిల్లాలో 12, కామారెడ్డి జిల్లాలో 28, కరీంనగర్ జిల్లాలో 54 కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి.

click me!