జార్ఖండ్‌లో మావోయిస్టుల‌కు భద్రతా బలగాలకు మ‌ధ్య కాల్పులు.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ కు గాయాలు..

By team teluguFirst Published Sep 19, 2022, 6:53 AM IST
Highlights

జార్ఖండ్ లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు అయ్యాయి. 

జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు అయ్యాయి. ఈ విష‌యాన్ని అధికారులు నిర్ధారించారు. గాయపడిన జ‌వాన్ ను చిత్రాంజన్ కుమార్‌గా గుర్తించారు. ఆయ‌న‌ను మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించారు.

ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్ల‌కుండా.. ఇంట్లో కూర్చొనే.. ఆన్‌లైన్‌లో 58 ఆర్‌టీఓ సేవలు

తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్మత్కం అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో జ‌వాన్ కాలు, నడుముకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఆపరేషన్ సమయంలో నలుగురు మావోయిస్టులకు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. అయితే వారంతా అక్క‌డి నుంచి తప్పించుకోగలిగారు.

మనోహర్ గంజు స్క్వాడ్‌లోని 15-20 మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో, CRPF, జార్ఖండ్ పోలీసు సిబ్బంది సంయుక్త బృందం ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించింది, ఈ సమయంలో తిరుగుబాటుదారులకు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయ‌నిచత్రా సబ్ -డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) అవినాష్ కుమార్ తెలిపారు.

రన్నింగ్ బ‌స్సులో ఒక్కసారిగా మంటలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఈ ఎదురుకాల్పుల్లో CRPF జవాన్‌తో పాటు నలుగురు మావోయిస్టులు గాయపడ్డారు. దట్టమైన ఆట‌వీ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకొని తిరుగుబాటుదారులు అడవుల్లోకి పారిపోయారు. అయితే భ‌ద్ర‌తా సిబ్బంది అడవిని చుట్టుముట్టారు. వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ఛత్ర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ రంజన్, అలాగే CRPF 190వ బెటాలియన్ కమాండెంట్ మనోజ్ కుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కాగా.. ఆదివారం ఉద‌యం లతేహర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో భద్రతా బలగాలు, జార్ఖండ్ జన్ ముక్తి పరిషత్ (జేజేఎంపీ)కి చెందిన నక్సలైట్ల మధ్య కాల్పులు జ‌రిగాయి. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు, CRPF 11వ బెటాలియన్ జాయింట్ టీమ్ పై JJMP తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

అదృష్టమంటే ఇతడిదే.. రాత్రికి రాత్రే.. కోట్ల రూపాయాల లాటరీ తగిలింది.!

భద్రతా దళాలు తిరిగి కాల్పులు జ‌ర‌ప‌డం ప్రారంభించారు. దీంతో తీవ్రవాదులు దట్టమైన అడవిలోకి పారిపోయారు, బోల్ట్ యాక్షన్ రైఫిల్‌తో పాటు అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వదిలివేసినట్లు అధికారులు తెలిపారు. 
 

click me!