
హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ రైతుల రుణాలను మాఫీ చేస్తుందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు రెండు గంటల్లోనే రైతుల రుణాలను 2 గంటల్లోనే మాఫీ చేసిందని ఆయన నొక్కి చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే హిమాచల్ ప్రదేశ్‌లో కూడా అదే చేస్తామని హామీ ఇచ్చారు.
“కాంగ్రెస్ మీకు 10 హామీలు ఇచ్చింది. వాటిని మేము ఎలా నెరవేరుస్తామో మీకు చెప్తాను. 10 రోజుల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన ఛత్తీస్‌గఢ్ నుంచి నేను వచ్చాను. అక్కడ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో 10 రోజుల్లో లేదా 10 గంటల్లో కాకుండా 2 గంటల్లోనే పూర్తి చేశాం ’’అని సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా భూపేష్ బఘెల్ బీజేపీ విధానాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సామాన్య ప్రజల జేబుల నుండి డబ్బును లాగుతోందని ఆరోపించారు. ఇంధన ధరలు, జీఎస్టీలో అపరిమిత పెరుగుదల కనిపిస్తోందని విమర్శించారు. ‘‘ బీజేపీ ప్రభుత్వం ప్రజల జేబుల్లోంచి డబ్బును బయటకు తీసేందుకే పని చేస్తోంది. పెట్రోల్, డీజిల్, పీఎన్‌జీ ధరలు పెంచుతోంది. ఇక్కడి అన్నింటికంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వారు రోటీలు, పరాఠాలపై కూడా జీఎస్టీ విధించారు. అది సామాన్యుడికి అత్యంత ముఖ్యమైనది. కాంగ్రెస్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం’’ అని ఆయన అన్నారు.
జీఎన్ సాయిబాబా, ఇతరుల విడుదలపై సుప్రీంకోర్టు స్టే.. డిసెంబర్ 8న విచారణ
ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండనుంది.
పెళ్లి చేసుకుంటానని యువతి మతం మార్చినందుకు ముస్లిం యువకుడి అరెస్టు.. ఎక్కడంటే ?
68 మంది సభ్యుల హిమాచల్ ప్రదేశ్ శాసనసభ పదవీకాలం 2023 జనవరి 8వ తేదీతో ముగియనుంది. ఈ ఎన్నికల కోసం మొత్తం 7,881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 142 పూర్తిగా మహిళలు, 37 వికలాంగులు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ తెలిపారు.