IMD Weather Update: నవంబర్ 2 నుండి దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, తమిళనాడుల్లో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, గురువారం (నవంబర్ 2) నుంచి మరింతగా వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.
South India-rainfall: నవంబర్ 2 నుండి దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, తమిళనాడుల్లో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, గురువారం (నవంబర్ 2) నుంచి మరింతగా వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలపై కూడా వర్షపాత ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. రానున్న కొద్ది రోజుల్లో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, తమిళనాడులో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నవంబర్ 2వ తేదీ నుంచి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్టోబర్ 30, నవంబర్ 3వ తేదీల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదికలు పేర్కొంటున్నాయి.
undefined
కాగా, సోమవారం ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శ్రీలంక, దానిని ఆనుకుని ఉన్న కొమోరిన్ ప్రాంతంలో తుఫాను ప్రభావం, బంగాళాఖాతం నుంచి ఈస్టర్లీ/ఈశాన్య గాలులు దిగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో ప్రవహిస్తుండటంతో దక్షిణ ద్వీపకల్ప భారతంలో రానున్న కొద్ది రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దక్షిణాదిలోని దాదాపు అన్ని ప్రాంతాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సోమవారం (అక్టోబర్ 30న) ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం కనిపించింది. అక్టోబర్ 30, 31 తేదీల్లో లక్షద్వీప్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ మీదుగా రానున్న 5 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 30, 31 తేదీల్లో తమిళనాడులో, 30, నవంబర్ 3 తేదీల్లో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తాజా పశ్చిమ అలజడి నవంబర్ 1 రాత్రి నుండి నవంబర్ 3 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు / హిమపాతానికి కారణమయ్యే అవకాశం ఉంది.