ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కు ఈడీ షాక్: నవంబర్ 2న విచారణకు రావాలని నోటీస్

By narsimha lode  |  First Published Oct 30, 2023, 9:58 PM IST

 ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.  నవంబర్ 2న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది.


న్యూఢిల్లీ:  ఆప్ చీఫ్,  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు  ఈడీ  సోమవారంనాడు నోటీసులు పంపింది. నవంబర్ రెండున విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు  ఈడీ నోటీసులు జారీ చేసింది.గతంలో  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ విచారించింది.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  సీబీఐ అధికారులు  కేజ్రీవాల్ ను  విచారించారు.  ఇదే కేసులో  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. 2021 నవంబర్ లో  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది.

2021-22 రూపకల్పన అమలులో  అవినీతికి పాల్పడినట్టుగా  మనీష్ సిసోడియాపై  ఆరోపణలు వచ్చాయి.  దీంతో  2022 జూలై మాసంలో  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రద్దు చేశారు.  ఈ కేసులో  2023  ఫిబ్రవరి  26న  సిసోడియాను  సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నెల  ప్రారంభంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్  కూడ అరెస్టయ్యారు. 2022 సెప్టెంబర్ లో  ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జీ విజయ్ నాయర్ అరెస్టయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  రెండు తెలుగు రాష్ట్రాల్లో  సీబీఐ,ఈడీ అధికారులు గతంలో విస్తృతంగా  సోదాలు నిర్వహించారు.ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

Latest Videos

click me!