ఉత్తరప్రదేశ్ సీఎం యోగికి పితృ వియోగం

Published : Apr 20, 2020, 02:29 PM IST
ఉత్తరప్రదేశ్ సీఎం యోగికి పితృ వియోగం

సారాంశం

.ఆనంద్‌సింగ్ గతంలో ఉత్తరాఖండ్‌ అటవీశాఖలో రేంజర్‌గా పనిచేసేవారు.  ఇదిలా ఉండగా.. కరోనా లాక్ డౌన్ కారణంగా.. కనీసం తండ్రి అంత్యక్రియల్లో కూడా యోగి ఆదిత్యనాథ్ పాల్గోనే అవకాశం కనపడటం లేదు.   

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. కాగా.. గత కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఈ క్రమంలో న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మార్చి 13న ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించారు. డాక్టర్లు తీవ్రంగా యత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు. ఈరోజు ఆయన కన్నుమూశారు. కాగా.. ఆయన మృతి పట్ల పలువరు సంతాపం తెలియజేశారు. కాగా...ఆనంద్‌సింగ్ గతంలో ఉత్తరాఖండ్‌ అటవీశాఖలో రేంజర్‌గా పనిచేసేవారు.  ఇదిలా ఉండగా.. కరోనా లాక్ డౌన్ కారణంగా.. కనీసం తండ్రి అంత్యక్రియల్లో కూడా యోగి ఆదిత్యనాథ్ పాల్గోనే అవకాశం కనపడటం లేదు. 

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు