ఐఐఎంసీ యూపీ విభాగం పూర్వ విధ్యార్ధుల అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఎన్నిక

By narsimha lodeFirst Published May 16, 2022, 9:33 PM IST
Highlights

ఐఐఎంసీ అల్యూమ్ని అసోసియేషన్  ఉత్తర్ ప్రదేశ్ చాప్టర్ వార్షిక సమావేశం ఇవాళ లక్నోలో జరిగింది. కూ కనెక్షన్స్ లక్నోలో జరిగింది.  ఈ సమావేశంలో అసోసియేషన్ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.


న్యూఢిల్లీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ Alumni అసోసియేషన్(పూర్వ విద్యార్ధుల అసోసియేషన్)  ఉత్తర్ ప్రదేశ్ Chapter వార్షిక సమావేశం  ''Koo Connections''  లక్నోలో ఆదివారం నాడు జరిగింది. చాప్టర్ అధ్యక్షుడు సంతోష్ వాల్మీకి అధ్యక్షతన ఈ వార్షిక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ప్రముఖ గేయ రచయిత, కథ రయిత నీలేష్ మిశ్రా, పంకజ్ ఝా, సురేంద్ర మిశ్రా, జీఎస్టీ అధికారి నిశాంత్ తరుణ్, డాక్టర్ ఉపేంద్ర కుమార్ , అర్చనాసింగ్ లు ప్రసంగించారు.

ఈ అసోసియేషన్ ప్రతి ఏటా దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా కనెన్షన్ సమావేశాలను నిర్వహిస్తుంది.  ఫిబ్రవరి 27న ఢిల్లీలో తొలి దశ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 28న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ కార్యక్రమం ముగియనుంది. ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. 

అధ్యక్షుడిగా మనేంద్ర మిశ్రా, ఉపాధ్యక్షుడిగా రంజిత్ సిన్హా, రాఘవేంద్ర సైనీ, రాశిలాల్, ప్రధాన కార్యదర్శిగా పంచవన్ మిశ్రా, కార్యదర్శులుగా మన్మోహన్ సింగ్, అర్చనా సింగ్, ఇంతియాజ్, కోశాధికారిగా ప్రభాత్ కుమార్ లు ఎంపికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా అరున్ వర్మ, కార్యవర్ఘ సభ్యులుగా బ్రహ్మానంద్, రాఘవేంద్ర శుక్లా, ఆర్య భరత్, రవి గుప్తా, ప్రాణేష్ తివారీ, అమిత్ యాదవ్, మనీష్ శుక్లా, అమిత్ కనోజియచా, భాస్కర్ సింగ్, శ్వేతా రాజ్ వంశీ, విజయ్ జైస్వాల్ ఎన్నికయ్యారు. 

ఐఎంసీఏఏ వ్యవస్థాపక సభ్యుడు రితేష్ వర్మ, ఐఎఫ్ఎఫ్ , ఐఐఎంసీఏఏ అవార్డు, ఐఐఎంసీఏఏ స్కాలర్ షిప్, మెడికల్ అసిస్టెంట్ పండ్,ఐఐఎంసీఏఏ  కేర్ ట్రస్ట్,  ఐఐఎంసీఏఏ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాల గురించి వివరించారు.

click me!