సర్జికల్స్ స్ట్రైక్-2: భారత్‌పై పాక్ దాడి చేస్తే..?

By Siva KodatiFirst Published Feb 26, 2019, 11:19 AM IST
Highlights

పుల్వామా ఉగ్రదాడి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులకు దిగిన సంగతి తెలిసిందే. జైషే మొహమ్మద్, లష్కర్, హిజుబుల్ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రర్ క్యాంపులను ఎయిర్‌ఫోర్స్ నేలమట్టం చేసింది. 

పుల్వామా ఉగ్రదాడి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులకు దిగిన సంగతి తెలిసిందే. జైషే మొహమ్మద్, లష్కర్, హిజుబుల్ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రర్ క్యాంపులను ఎయిర్‌ఫోర్స్ నేలమట్టం చేసింది.

భారత్ తమ గగనతలంలోకి ప్రవేశించి వైమానిక దాడులకు పాల్పడటాన్ని దాయాది దేశం జీర్ణించుకోలేకపోతోంది. ప్రజలు, ఇతర ప్రజా సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తే లోపు భారత్‌పై ప్రతి దాడి చేయాలని ఆ దేశం భావిస్తే పరిస్థితి ఏంటనే దానిపై రక్షణ శాఖ చర్యలు చేపట్టింది.

దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ హైఅలర్ట్ ప్రకటించింది. పాకిస్తాన్ సరిహద్దుల్లోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ముందుగానే సిద్ధం చేసింది.  

పాకిస్తాన్ ఆర్మీ, నేవి, మిలటరీ నుంచి ఎలాంటి ప్రతిదాడి వచ్చినా దానిని ఎదుర్కోనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు త్రివిధ దళాలు ప్రకటించాయి. అరేబియా సముద్రంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

ఎయిర్‌బేస్‌లు, నావల్ కమాండ్‌, మిలటరీ బెటాలియన్లను ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా రక్షణ శాఖ అప్రమత్తం చేసింది. 

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?

click me!