సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?

By Siva KodatiFirst Published Feb 26, 2019, 10:58 AM IST
Highlights

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మిరాజ్-2000 యుద్ధ విమానం కీలకపాత్ర పోషించడంతో ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మిరాజ్-2000 యుద్ధ విమానం కీలకపాత్ర పోషించడంతో ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

ఈ క్రమంలో మిరాజ్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే... ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ ఈ విమానాన్ని తయారు చేసింది. 1970లలో తొలిసారిగా మిరాజ్ తయారై... ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్‌లో సేవలు అందిస్తోంది.

వీటిలో మిరాజ్-2000 సింగిల్ సీటర్, టూసీటర్ మల్టీరోల్ ఫైటర్లున్నాయి. ఈ విమానంలో తొమ్మిది చోట్లకు ఆయుధాలను తీసుకెళ్లవచ్చు. ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబుల్ని వేయగల సత్తా మిరాజ్-2000 యుద్ధ విమానానికి ఉంది.

మైకా మల్టీ టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్‌సెప్ట్, వార్ మిస్సైల్స్ , మ్యాజిక్-2 మిస్సైల్స్‌ను మిరాజ్ మోసుకెళ్లగెలదు. కార్గిల్ యుద్ధ సమయంలో ఇవి భారత దేశానికి కీలకంగా వ్యవహరించాయి.

శతృ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో ఇది మోస్ట్ స్పెషలిస్ట్. నాటి యుద్ధంలో శత్రు స్థావరాలను ధ్వంసం చేసి తిరిగి వాయుసేన స్థావరాలకు తిరిగి వచ్చి...కార్గిల్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడటంలో మిరాజ్-2000 విమానాలది కీలకపాత్ర.

అంతటి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టే... ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీటిని సర్జికల్ స్ట్రైక్స్‌కు వినియోగించింది. 

click me!