
తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే, వారే తమ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలోని తన నియోజకవర్గంలోని అలీగంజ్, పాలికా కుంజ్‌లలో నిర్వహించిన మహర్షి వాల్మీకి ప్రకటోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ జోడో యాత్రపై ఈసీకి ఫిర్యాదు.. మరీ కాంగ్రెస్ వివరణేంటీ?
అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి, బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లల నాణ్యమైన విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని కొనియాడారు. తమ ప్రభుత్వ ఉద్దేశం కూడా అదేనని అన్నారు. ‘‘ ఢిల్లీలో విద్య మా మొదటి ప్రాధాన్యత. పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే వారు తమ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వారి కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. దీని వల్ల దేశం కూడా పురోగమిస్తుంది. ఒక వేళ పిల్లలు చదువుకోకపోతే వారి కుటుంబం వెనుకబడి పోతుంది. మళ్లీ వారెప్పుడూ పేదలుగానే మిగిలిపోతారు. ’’ అని కేజ్రీవాల్ అన్నారు.
36యేళ్లుగా కూతుర్ని గదిలో గొలుసుతో బంధించిన తండ్రి, మలమూత్రవిసర్జన అక్కడే, తలుపు కిందినుంచే భోజనం..
పిల్లల చదువుపై ప్రజలు కూడా మంచి శ్రద్ద పెట్టాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ‘‘ వారు బాగా చదువుకుంటే తల్లిదండ్రులను ఆదుకుంటారు. వృద్ధాప్యంలో అండగా ఉంటారు. ఢిల్లీలో విద్య, వైద్యం మా మొదటి ప్రాధాన్యత. ఇది నా అసెంబ్లీ నియోజకవర్గం. మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఏదైనా సమస్య ఉంటే నాకు తెలియజేయండి. పిల్లలు, వారి చదువు మాత్రమే మీకు సాయం చేస్తుంది. మరే ఇతర సంపద వల్ల ఉపయోగం ఉండదు ’’ అని కేజ్రీవాల్ అన్నారు.
రైల్లో వేలాడుతూ మరణాయుధాలతో వీరంగం.. ముగ్గురు ఆకతాయుల అరెస్ట్
‘‘ మహర్షి వాల్మీకి ప్రకటోత్సవం సందర్భంగా మొత్తం సమాజానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన మీకు, మీ కుటుంబాలు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మనకు ఇప్పుడే దసరా, నవరాత్రులు గడిచిపోయాయి. దీపావళి, ఛత్ పూజలు రాబోతున్నాయి. దయచేసి ఈ పండుగలన్నింటినీ పూర్తి వైభవంగా, ఆనందంతో జరుపుకోండి ’’ అని కేజ్రీవాల్ ప్రజలను కోరారు.