36యేళ్లుగా కూతుర్ని గదిలో గొలుసుతో బంధించిన తండ్రి, మలమూత్రవిసర్జన అక్కడే, తలుపు కిందినుంచే భోజనం..

By SumaBala BukkaFirst Published Oct 11, 2022, 1:21 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లోని మహోర్ లో కూతుర్ని 36యేళ్లపాటు గదిలో బందించాడో కన్నతండ్రి. ఆమె మానసిక స్థితి సరిగాలేదని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇటీవల ఆయన చనిపోయాడు. 

ఉత్తర ప్రదేశ్ : ఫిరోజాబాద్ లో కన్నకుమార్తె పట్ల ఓ తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. 36 ఏళ్ళుగా ఆమెను గదిలో బంధించిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన స్వప్నా జైన్ (53)కు  మానసిక స్థితి సరిగా లేదు. ఆ కారణంతో ఆమెకు 17 ఏళ్ల వయసులో ఆమెను తండ్రి గదిలోకి తీసుకు వెళ్లాడు. అక్కడే గొలుసులతో కట్టేసి బంధించాడు.

అప్పటినుంచి గదిలో ఉన్న స్వప్నకు ఆమె కుటుంబ సభ్యులు తలుపు కింది నుంచి భోజనం పంపించేవారు. స్వప్న మలమూత్ర విసర్జన కూడా అదే గదిలో చేసేది. కిటికీలోనుంచి నీళ్లు పోస్తూ ఆమెకు స్నానం చేయించేవారు. అలా ఆమె 36 ఏళ్లు గది దాటి బయటకు రాలేదు. స్వప్న తండ్రి కొద్ది నెలల క్రితం చనిపోయాడు. దీంతో స్వప్న విషయం బైటికి వచ్చింది. తాజాగా స్వప్న గురించి తెలుసుకున్న స్థానిక స్వచ్ఛంద సంస్థ  సేవా భారతి సభ్యులు..  అధికారులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెను బయటకు తీసుకు వచ్చి వైద్య చికిత్స నిమిత్తం ఆగ్రాలోని ఆస్పత్రికి తరలించారు. 

దారుణం : కేరళలో ఇద్దరు మహిళల నరబలి, ముగ్గురి అరెస్ట్..

ఆమె తండ్రి ఇటీవల మరణించిన తర్వాత పరిస్థితులు మారడం ప్రారంభించాయి. దీంతో ఎన్జీవోకు చెందిన కొందరు మహిళలు ఆమె ఇంటికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వారు సప్నా చాలా దారుణమైన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె చుట్టూ దుర్గంధం.. ఆమె ఒంటినిండా మురికితో నిండి ఉంది. ముందు వారు ఆమెకు శుభ్రంగా స్నానం చేయించారు. కొత్త బట్టలు వేయించారు. స్థానిక ఎమ్మెల్యే మహౌర్ సప్నా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెను ఆగ్రాలోని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి ఒప్పించారు. 

అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించారు. ఆమె పరిస్థితి మామూలుగానే ఉందని.. కొన్ని వారాల్లో ఆమె కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సప్నా 17 యేళ్ల వయస్సులో ఉన్నప్పుడు గదిలో బంధించబడిందని, అప్పటికి ఆమె మైనర్ అని, ఆమె జీవితంలోని అతి ముఖ్యమైన కాలాన్ని ఆ గదిలోనే బంధించబడి, కోల్పోయిందని మహౌర్ చెప్పారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయితే, సప్నా పరిస్థితి గురించి తమకు తెలుసునని.. ఆమెను డాక్టర్‌కు చూపించాల్సిందిగా కుటుంబ సభ్యులకు ఎన్నిసార్లు చెప్పినా.. వారు అది తమ కుటుంబ వ్యవహారమని.. ఎవరి జోక్యం అక్కరలేదని చెప్పేవారని ఇరుగుపొరుగు కొందరు చెప్పారు.

click me!