Karnataka: మీరు రాజ్యాంగాన్ని స్వీకరించకుంటే పాకిస్తాన్‌కు వెళ్లిపోండి: బీజేపీపై కర్ణాటక మంత్రి నిప్పులు

By Mahesh KFirst Published Jan 29, 2024, 1:51 PM IST
Highlights

కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగం, జాతీయ జెండా, దేశ సమగ్రతపై విశ్వాసం లేకుంటే వారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని అన్నారు. సమాజం శాంతియుతంగా ఉంటే బీజేపీకి మనశ్శాంతి ఉండదేమో అని పేర్కొన్నారు.
 

Constitution: కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులపై మండిపడ్డారు. జాతీయ జెండా, భారత రాజ్యాంగం, దేశ సమగ్రతపై నమ్మకం లేకుంటే ఆ పార్టీ నేతలు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుట్రలు, వ్యూహాలకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.

మాండ్యా జిల్లాలో జనవరి 19వ తేదీన కాషాయ జెండాను ఎగరేశారు. దాన్ని అధికారులు పట్టించుకోలేదు. జనవరి 26వ తేదీ వరకు అదే జెండా ఎగురుతూనే ఉన్నది. గణతంత్ర దినోత్సవాన ఆ జెండాను అవనతం చేసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతీయ జెండాను దింపేసి మళ్లీ కాషాయ జెండాను ఎగరేశారు. దీంతో అధికారులు పోలీసుల సమక్షంలో హనుమంతుడి బొమ్మతో ఉన్న ఆ కాషాయ జెండాను దింపేశారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య  వివాదాస్పద ఘటనగా మారింది.

Latest Videos

ఈ ఘటనపై మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఆర్ఎస్ఎస్ తరహాలోనే దాని చేత శిక్షణ పొందిన బీజేపీ కూడా త్రివర్ణ పతాకాన్ని ద్వేషిస్తుందని అన్నారు. జాతీయ పతాకాన్ని గౌరవించకుండా దాన్ని ఇవి ద్వేషిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్రను ప్రస్తావిస్తూ.. ఆ జెండా పోల్‌ లక్ష్యమైన జాతీయ జెండాను ఎగరేసే కర్తవ్యం పూర్తవయిందని వివరించారు. అయినా.. వారికి ఎందుకు అంత ద్వేషం? అని ప్రశ్నించారు. జాతీయ జెండాపై ద్వేషాన్ని చూపించి వారికి వారే దేశ ద్రోహులుగా నిరూపించుకున్నారని ఫైర్ అయ్యారు.

Also Read: Nitish Kumar: 5 కంటే ఎక్కువ సార్లు సీఎం అయినవారి జాబితా ఇదే

సమాజం శాంతియుతంగా ఉంటే బీజేపీకి మనశ్శాంతి ఉండదేమో అని ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. రాజకీయ లబ్ది కోసం మాండ్యా జిల్లాలో నిప్పు పెట్టే స్థాయికి బీజేపీ దిగజారిందని అన్నారు.

click me!