మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

By narsimha lodeFirst Published Mar 1, 2019, 11:15 AM IST
Highlights

 భారత ప్రజలకు అభినందన్  నిజమైన హీరో. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే  అభినందన్ నిజ జీవితంలో చోటు చేసుకొంది. శత్రువులకు చిక్కినా కూడ ఏ మాత్రం అధైర్యపడలేదు. 

న్యూఢిల్లీ: భారత ప్రజలకు అభినందన్  నిజమైన హీరో. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే  అభినందన్ నిజ జీవితంలో చోటు చేసుకొంది. శత్రువులకు చిక్కినా కూడ ఏ మాత్రం అధైర్యపడలేదు.  పాక్‌లో తాను ల్యాండైనట్టుగా గుర్తించిన  వెంటనే అభినందన్ తన వద్ద ఉన్న కీలకమైన పత్రాలను నమిలి మింగేశాడు. మరికొన్నింటిని సమీపంలోని  నీటి గుంతలో వేశాడు.

రెండు రోజుల క్రితం అభినందన్ పాక్ విమానానాన్ని వెంటాడుతు వెళ్లిన క్రమంలో తాను నడుపుతున్న మిగ్ విమానం కుప్పకూలింది. ఈ క్రమంలో అభినందన్  ప్యారాచూట్ సహాయంతో  పాక్‌ భూభాగంలోని హౌరాన్ గ్రామంలో దిగాడు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని భీంబర్జిల్లాలోని హౌరాన్ గ్రామం ఉంది.  ఇది ఎల్ఓసీకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన ఓ రాజకీయ పార్టీకి చెందిన  కార్యకర్త షోయబ్ అభినందన్ ప్యారాచూట్ సహాయంతో దిగిన విషయాన్ని గమనించాడు.

షోయబ్ తన స్నేహితుడు రజ్జాను పిలిచి అభినందన్ దిగిన ప్రాంతానికి వెళ్లాడు. అభినందన్ దగ్గరకు వారిద్దరూ చేరుకొనే సమయానికి ఈ ప్రాంతం ఇండియాదా, పాకిస్థాన్‌దా అని అడిగాడు. అయితే వీరిద్దరూ కూడ ఇండియాది అని అబద్దం చెప్పారు.

దీంతో అభినందన్  ఇండియాకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో  తన నడుము బాగం దెబ్బతిందని దాహంగా ఉంది, మంచినీళ్లు కావాలని  అభినందన్ అడిగాడు.  

ఈ సమయంలో అక్కడకు చేరుకొన్న జన సమూహం ఈ ప్రాంతం కిల్లాన్, పాకిస్తాన్‌లోనిదని చెప్పి పాక్‌కు అనుకూలంగా  నినాదాలు చేసినట్టుగా పాక్‌కు చెందిన డాన్ ప్రకటించింది.

ఈ క్రమంలోనే అభినందన్‌పై స్థానికులు దాడికి ప్రయత్నించారు.దీంతో అభినందన్  గాల్లోకి కాల్పులు జరిపి సమీపంలోని నీటి గుంతలో దూకి పారిపోయేందుకు ప్రయత్నించినట్టుగా ఆ వార్తా సంస్థ ప్రకటించింది.

ఈ సమయంలో తన గుర్తింపును తెలిపే కీలకమైన డాక్యుమెంట్లను అభినందన్  మింగేశాడు. మరోవైపు తన సర్వైవల్ కిట్ తో పాటు ఇతర డాక్యుమెంట్లను తన రక్తంతో పాటు ఆ నీటిలో ఉన్న బురదమట్టిలో ముంచేశాడు. ఈ సమయంలోనే ఓ స్థానికుడు అభినందన్ కాలు వైపు కాల్పులు జరిపాడు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పాక్ ఆర్మీ వచ్చిన తర్వాత నీటి గుంతలో ఉన్న ఈ డాక్యుమెంట్లను ఆర్మీకి అందించారు. స్థానికులు అభినందన్‌పై దాడికి దిగే సమయంలోనే పాక్ ఆర్మీకి చెందిన ఆరుగురు బృందం అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకొన్నారు.

అభినందన్‌ను హౌరాన్ నుండి భీంభర్ మిలటరీ హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. భీంభర్ మిలటరీ హెడ్‌క్వార్టర్ ముజఫరాబాద్‌లో ఉంటుంది. హౌరాన్ నుండి ముజఫరాబాద్‌‌కు 58 కి.మీ. దూరం ఉంటుంది.

అభినందన్‌ను  పాక్ ఆర్మీ తమ హెడ్‌క్వార్టర్‌కు తరలించే క్రమంలో  రోడ్డుకు ఇరువైపులా ప్రజలు గులాబీ పూలతో  పాక్ ఆర్మీకి స్వాగతం పలికారు.పాక్ ఆర్మీ అధికారులు ఆ తర్వాత అభినందన్ తో జరిపిన సంభాషణ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

 

click me!