అభినందన్‌‌కు స్వాగతం పలకడం.. నాకు దక్కిన గౌరవం: అమరీందర్ సింగ్

By Siva KodatiFirst Published Mar 1, 2019, 11:08 AM IST
Highlights

పాక్ చెరలో బందీగా ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను శుక్రవారం పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించనున్న విషయం తెలిసిందే. వాఘా సరిహద్దు గుండా ఆయన స్వదేశంలో అడుగుపెట్టనున్నారు. 

పాక్ చెరలో బందీగా ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను శుక్రవారం పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించనున్న విషయం తెలిసిందే. వాఘా సరిహద్దు గుండా ఆయన స్వదేశంలో అడుగుపెట్టనున్నారు.

ఈ క్రమంలో అభినందన్‌కు స్వాగతం పలికేందుకు ఎయిర్‌ఫోర్స్, భారత సైన్యం, ప్రజలతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం వాఘా సరిహద్దు వద్ద ఎదురుచూస్తున్నారు.

అభినందన్‌కు స్వాగతం పలకాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ.... అమరీందర్‌సింగ్‌కు సూచించారు. అమరీందర్‌, అభినందన్ తండ్రి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్ధులు కావడం విశేషం.

దీనిపై ఆయన ట్వీట్ చేస్తూ... డియర్ మోడీ జీ.. నేనిప్పుడు ఇండో-పాక్ సరిహద్దుల్లో పర్యటిస్తున్నాను. అమృతసర్‌కు దగ్గరలో ఉన్నాను. అభినందన్‌ను పాక్ ప్రభుత్వం వాఘా సరిహద్దులో భారత్‌కు అప్పగిస్తానని తెలిపింది.

ఆయనకు స్వాగతం పలకడం నాకు దక్కిన గౌరవమని, వర్ధమాన్ తండ్రి, తాను నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్ధులమని ఆయన ట్వీట్ చేశారు. పాక్ ప్రభుత్వం అభినందన్ వర్థమాన్‌ను క్షేమంగా విడుదల చేయడం ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గిస్తుందని అమరీందర్ తెలిపారు.

పుల్వామా ఉగ్రదాడి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో అమరీందర్ సింగ్.. పంజాబ్‌లో ఉన్న భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 

click me!