సర్జికల్ స్ట్రైక్స్‌కు ఎయిర్‌ఫోర్స్‌ని ఎందుకు వాడారంటే...?

By Siva KodatiFirst Published Mar 1, 2019, 10:47 AM IST
Highlights

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ప్రధాని నరేంద్రమోడీ అన్న మాట ప్రకారం పాకిస్తాన్‌పై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆదేశించారు. 

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ప్రధాని నరేంద్రమోడీ అన్న మాట ప్రకారం పాకిస్తాన్‌పై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆదేశించారు. ప్రధాని ఆదేశాలతో రెచ్చిపోయిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నియంత్రణ రేఖ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌పై బాంబుల వర్షం కురిపించింది.

ఈ దాడిలో బాలాకోట్‌లో ఉన్న జైషే మొహహ్మద్ అతిపెద్ద ఉగ్రవాద కేంద్రం ధ్వంసమైంది. అయితే సర్జికల్ స్ట్రైక్స్‌కు భారత్....వైమానిక దళాన్నే ఎందుకు ఎంచుకుంది అంటూ దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు.

సైన్యంలోని స్పెషల్ కమాండోస్ లేదంటే నౌకాదళాన్ని రంగంలోకి దించలేదు అనేది భారతీయులను వేధిస్తోంది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఉరీ ఉగ్రదాడికి ప్రతీకారంగా 2016లో చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ పాకిస్తాన్‌కు బాగా గుర్తుంది.. అందుకే భారత్ మరోసారి అటువంటి చర్యకు దిగకుండా సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరించింది.

ఉగ్రవాదులను సైతం శిబిరాల నుంచి తరలించింది. దీనికి తోడు కశ్మీర్ సరిహద్దుల వెంట భారీగా మంచు కురుస్తుండటం సైన్యానికి అవరోధంగా మారింది. అయితే నేవి సాయంతో పాక్ ఆర్ధిక రాజధాని కరాచీని దిగ్బంధించాలని భారత్ భావించింది.

అయితే ఇది అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీయడంతో పాటు వెను వెంటనే యుద్ధంగా మారే అవకాశం ఉండటంతో కేంద్రప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకుంది. వీటన్నింటి తర్వాత ఉగ్రవాద స్థావరాలను సూచిస్తే... వాటిని నామరూపాల్లేకుండా చేసే సత్తా వాయుసేనకు ఉందని.. వైమానిక దళపతి ఎయిర్‌చీఫ్ మార్షల్ ధనోవా ప్రధానికి సూచించారు.

దీంతో రక్షణ రంగ నిపుణులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో చర్చించిన పిమ్మట ప్రధాని ఎయిర్ స్ట్రైక్స్‌కు అనుమతించారు. 

click me!