వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం

By narsimha lodeFirst Published Mar 1, 2019, 1:00 PM IST
Highlights

పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్  అభినందన్‌ను  రిసీవ్ చేసుకొనేందుకు భారత వైమానిక దళం ప్రత్యేక బృందం వాఘా బోర్డర్‌కు చేరుకొంది.
 

న్యూఢిల్లీ: పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్  అభినందన్‌ను  రిసీవ్ చేసుకొనేందుకు భారత వైమానిక దళం ప్రత్యేక బృందం వాఘా బోర్డర్‌కు చేరుకొంది.

రెండు రోజుల క్రితం పాక్ ఆర్మీకి ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్ చిక్కాడు. అభినందన్‌ను విడుదల చేస్తామని ఇమ్రాన్ ఖాన్ పాక్ పార్లమెంట్‌లోనే ప్రకటించారు.

శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత  అభినందన్ ‌ వాఘా బోర్డర్‌ను చేరుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ తరుణంలో  అభినందన్‌ను రిసీవ్ చేసుకొనేందుకుగాను భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక బృందం ఇప్పటికే  వాఘాకు చేరుకొంది.

పాక్ ఆర్మీ అధికారుల బృందం వాఘా-అటారీ సంయుక్త చెక్‌పోస్ట్ వద్ద అభినందన్‌ను అప్పగించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి కొన్ని న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

click me!