
న్యూఢిల్లీ: అభినందన్ వర్తమాన్ తల్లిదండ్రులు చెన్నై నుండి ఢిల్లీకి విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో తోటీ ప్రయాణీకులు వాళ్లకు చప్పట్లలో అభినందనలు తెలిపారు.
అభినందన్ ను శుక్రవారం నాడు విడుదల చేయనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన వెంటనే అభినందన్ తల్లిదండ్రులు గురువారం రాత్రి చెన్నై నుండి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.
ఈ విమానంలో ఉన్న తోటి ప్రయాణీకులు అభినందన్ తల్లిదండ్రులను చూసీ భావోద్వేగానికి గురయ్యారు. వారికి చప్పట్లతో స్వాగతం పలికారు. కేరింతలు కొట్టారు. అభినందనలు తల్లిదండ్రులు కూర్చొన్న సీటు వద్దకు వెళ్లి వారితో సెల్పీలు దిగారు.
గురువారం అర్ధరాత్రి అభినందన్ తల్లిదండ్రులు ప్రయాణీస్తున్న విమానం ఢిల్లీకి చేరుకొంది. శుక్రవారం నాడు ఉదయం అభినందన్ తల్లిదండ్రులు వాఘాకు చేరుకొన్నారు. తమ కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు.
సంబంధిత వార్తలు
మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు
వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు
మసూద్ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్