అభినందన్ ను రిసీవ్ చేసుకున్న ఐఏఎఫ్ అధికారులు, వైద్యపరీక్షలకు తరలింపు

By Nagaraju penumalaFirst Published Mar 1, 2019, 9:50 PM IST
Highlights

అభినందన్ తిరిగి రావడంతో సంతోషకరమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. అభినందన్ ఒత్తిడికి గురైనట్లు కనబడుతోంది. అభినందన్ కు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చెయ్యించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 
 

వాఘా-అటారీ బోర్డర్: వాయుపుత్రుడు, వింగ్ కమాండర్ అభినందన్ ను తమకు అప్పగించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. వాఘా అటారీ బోర్డర్ వద్ద పాక్ అధికారులు భారత్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా వింగ్ కమాండర్ అభినందన్ ను తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించారు. 

అభినందన్ తిరిగి రావడంతో సంతోషకరమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. అభినందన్ ఒత్తిడికి గురైనట్లు కనబడుతోంది. అభినందన్ కు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చెయ్యించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

అంతకు ముందు వింగ్ కమాండ్ అభినందన్ ను వాఘా-అటారీ బోర్డర్ వద్దకు పాక్ అధికారులు తీసుకువచ్చారు. అక్కడ ఇరుదేశాల అధికారులు పత్రాలు మార్చుకున్నారు. అప్పగింత పత్రాలు మార్చుకున్న అనంతరం అభినందన్ మాతృభూమిపై అడుగుపెట్టారు. 

వింగ్ కమాండర్ కు ఐఏఎఫ్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అటు ఆర్మీ సిబ్బంది సైతం ఆత్మీయ స్వాగతం పలికారు. భారతగడ్డపై అడుగుపెట్టిన వెంటనే భారతీయులు జై భారత్, జై అభినందన్ అంటూ నినాదాలు చేశారు. పాకిస్థాన్ చెరలో ఉన్న అభినందన్ భారతదేశంలో అడుగుపెట్టడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.  

ఈ వార్తలు కూడా చదవండి

మాతృభూమిపై అడుగుపెట్టిన అభినందన్

అభినందన్ విడుదలపై వీడని ఉత్కంఠ: అప్పగించలేదంటున్న పాకిస్థాన్

వాఘా బోర్డర్ లో అభినందన్: మరికాసేపట్లో అప్పగింత

click me!