వాఘా బోర్డర్ లో అభినందన్: మరికాసేపట్లో అప్పగింత

Published : Mar 01, 2019, 09:12 PM IST
వాఘా బోర్డర్ లో అభినందన్: మరికాసేపట్లో అప్పగింత

సారాంశం

కానీ రాత్రి 9గంటల వరకు అభినందన్ ను అప్పగించకుండా పాకిస్థాన్ హైడ్రామా క్రియేట్ చెయ్యడం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. శుక్రవారం అభినందన్ విడుదలవుతారంటూ యావత్ భారతావని అంతా సంబరాలు చేసుకుంటుంది. పాకిస్థాన్ నుంచి విడుదల కాబోతున్న అభినందన్ కు స్వాగతం పలికేందుకు వాఘా బోర్డర్ దగ్గర భారీ సంఖ్యలో భారతీయులు చేరుకున్నారు. 

లాహోర్: ఎట్టకేలకు పాకిస్థాన్ ఆర్మీ చేతికి చిక్కిన ఐఏఎఫ్ పైలట్ అభినందన్ వాఘా బోర్డర్ వద్దకు తీసుకువచ్చారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చెయ్యడంలో జాప్యం జరిగిందని పాక్ అధికారులు స్పష్టం చేశారు. మరికాసేపట్లో అభినందన్ ను భారత్ అధికారులకు పాక్ అధికారులు అప్పగించనున్నారు. 

అంతకు ముందు పాకిస్థాన్ ఆర్మీ చేతిలో యుద్ధఖైదీగా ఉన్న అభినందన్ విడుదల విషయంలో పాకిస్థాన్ హైడ్రామా చేసింది. అభినందన్ ను శుక్రవారం అప్పగిస్తామని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాక్ చెరలో ఉన్న వ్యక్తిని భారత్ కు అప్పగిస్తామంటూ ప్రకటించారు. 

కానీ రాత్రి 9గంటల వరకు అభినందన్ ను అప్పగించకుండా పాకిస్థాన్ హైడ్రామా క్రియేట్ చెయ్యడం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. శుక్రవారం అభినందన్ విడుదలవుతారంటూ యావత్ భారతావని అంతా సంబరాలు చేసుకుంటుంది. పాకిస్థాన్ నుంచి విడుదల కాబోతున్న అభినందన్ కు స్వాగతం పలికేందుకు వాఘా బోర్డర్ దగ్గర భారీ సంఖ్యలో భారతీయులు చేరుకున్నారు. 

ఉదయం నుంచి జయహో భారత్, జయహో అభినందన్ అంటూ నినాదాలు చేశారు. అటు అభినందన్ ను రిసీవ్ చేసుకునేందుకు మధ్యవర్తిత్వం వహించిన ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు, ప్రత్యేక హెల్త్ బృందం, ఎయిర్ ఫోర్స్ అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

శుక్రవారం కావడంతో పాకిస్థాన్ లో ప్రార్థనల అనంతరం మధ్యాహ్నాం నుంచి విడుదల ప్రక్రియ ప్రారంభం అవుతుందని అంతా భావించారు. సాయంత్రం నాలుగు గంటలకు అభినందన్ ను పాకిస్థాన్ విడుదల చేస్తోందంటూ భారతీయులు, అధికార బృందం వేచి చూస్తోంది. 

అయితే పాకిస్థాన్ డాక్యుమెంటేషన్ పేరుతో అభినందన్ ను విడుదల చెయ్యడంలో జాప్యం చేస్తోంది. కావాలనే జాప్యం చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్, దౌత్యపరమైన టెక్నికాలిటీస్ వంటి పేరుతో జాప్యం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అభినందన్ లాహోర్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు అభినందన్ ను భారత్ కు అప్పగించినట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ గానీ, అభినందన్ తమ ఆధీనంలో ఉన్నారని పాకిస్థాన్ అప్పగించిందంటూ భారత్ గానీ ఎలాంట ప్రకటన విడుదల చెయ్యలేదు. 

అయితే రాత్రి 9గంటలు దాటిన తర్వాత వాఘా బోర్డర్ వద్దకు అభినందన్ ను తీసుకువచ్చింది. డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాతే తీసుకువచ్చినట్లు పాక్ అధికారులు స్పష్టం చేశారు. 


ఈ వార్తలు కూడా చదవండి

అభినందన్ విడుదలపై వీడని ఉత్కంఠ: అప్పగించలేదంటున్న పాకిస్థాన్

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు