ప్రత్యేక విమానంలో ఢిల్లీకి అభినందన్ తరలింపు: కొడుకును చూసి భావోద్వేగానికి గురైన తల్లిదండ్రులు

By Nagaraju penumalaFirst Published Mar 1, 2019, 10:15 PM IST
Highlights

అమృత్ సర్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు.  ఇద్దరు ఎయిర్ మార్షల్స్ ఆధ్వర్యంలో అభినందన్ ను ఢిల్లీకి తరలించారు. అభినందన్ తో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇకపోతే వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు అభినందన్ భారత్ అధికారులకు అప్పగించారు. 

వాఘా-అటారీ: మాతృభూమిపై అడుగుపెట్టిన వాయుపుత్రుడు అభినందన్ ను వాఘా-అటారీ బోర్డర్ నుంచి అమృత్ సర్ కు తరలించారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు. వాఘా బోర్డర్ వద్ద అభినందన్ కు స్వాగతం పలికిన ఎయిర్ ఫోర్స్ అధికారులు భారీ కట్టుదిట్టమైన భద్రత నడుమ అమృత్ సర్ కు తరలించారు. 

అమృత్ సర్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు.  ఇద్దరు ఎయిర్ మార్షల్స్ ఆధ్వర్యంలో అభినందన్ ను ఢిల్లీకి తరలించారు. అభినందన్ తో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇకపోతే వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు అభినందన్ భారత్ అధికారులకు అప్పగించారు. 

ఇరుదేశాలు అప్పగింత పత్రాలు సమర్పించుకున్న అనంతరం అభినందన్ భారతమాత గడ్డపై అడుగుపెట్టారు. అభినందన్ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ వింగ్ కమాండర్ అభఇనందన్ ను తమకు అప్పగించినట్లు ఇండియన్ ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ ప్రకటించారు. 

అభినందన్ తిరిగిరావడం సంతోషంగా ఉందన్నారు. అభినందన్ ఒత్తిడిలో ఉన్నట్లు కనబడుతోంది. అందువల్ల వైద్య పరీక్షల నిమిత్తం అతనిని వైద్య పరీక్షలకు పంపనున్నట్లు తెలిపారు. ఇమ్మిగ్రేషన్, డాక్యుమెంటేషన్ పూర్తి చెయ్యడంలో ఆలస్యం అయినట్లు ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీవీ కపూర్ తెలిపారు. తెలిపారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

అభినందన్ ను రిసీవ్ చేసుకున్న ఐఏఎఫ్ అధికారులు, వైద్యపరీక్షలకు తరలింపు

మాతృభూమిపై అడుగుపెట్టిన అభినందన్

అభినందన్ విడుదలపై వీడని ఉత్కంఠ: అప్పగించలేదంటున్న పాకిస్థాన్

వాఘా బోర్డర్ లో అభినందన్: మరికాసేపట్లో అప్పగిం

click me!