గతజన్మ గుర్తొచ్చింది.. ఆదివారాలు ఆఫీసుకు రాలేను.. ఇంజనీర్ లీవ్ అప్లికేషన్.. దిమ్మదిరిగే రిప్లై ఇదే

By telugu teamFirst Published Oct 10, 2021, 4:09 PM IST
Highlights

నాకు నా గత జన్మ గుర్తుకు వస్తున్నది. గతజన్మలో అసదుద్దీన్ ఒవైసీ నా మిత్రుడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ షకుని మామా. గీతా చదువుతు ఆ విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. నాకు ఆదివారాలు సెలవు ఇవ్వగలరు అని ఓ డిప్యూటీ ఇంజినీర్ రాసిన లీవ్ అప్లికేషన్ మొదటికే మోసం తెచ్చింది. నీ అహాన్ని చంపుకోవడానికి ప్రతి ఆదివారం తప్పకుండా ఆఫీసుకు రావాలని పై అధికారి నుంచి సమాధానం రావడంతో బిక్కముఖం వేసుకోవడం ఇంజినీర్ వంతైంది.
 

భోపాల్: ఉద్యోగులకు సెలవులపై ఎప్పుడూ ఓ కన్ను ఉండనే ఉంటుంది. week offలు sunday ఉంటే ఇంకా పండుగే. కానీ, ఇది అందరికీ కుదరదు. ఎలాగైనా తనకు ఆదివారాల్లో వీక్ ఆఫ్ పొందాలని madhya pradesh ఎంఎన్ఆర్ఈజీఏ engineer చెప్పిన కారణాలు నిశ్చేష్టులను చేస్తున్నాయి. ఆయన చెప్పిన కారణాలతో ఉన్న ఆ దరఖాస్తును తిరస్కరించడమే కాదు.. కచ్చితంగా ప్రతి ఆదివారం ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి.

అగర్ మల్లా జిల్లా సుస్నేర్‌లో డిప్యూటీ ఇంజినీర్‌గా చేస్తున్న రాజ్‌కుమార్ యాదవ్ పై అధికారికి తన వీక్ ఆఫ్ గురించి లేఖ రాశాడు. ఆదివారాలు తాను పనికి హాజరుకాలేకపోతున్నానని, తనకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయని తెలిపాడు. గత జన్మలో asaduddin owaisi తన మిత్రుడని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ‘శకుని మామా’ అని చెప్పాడు. మహాభారతంలో పాచిక ఆటలో మాయలు చేసిన పాత్ర శకుడు అని తెలిసినదే.

‘నేను గీతా చదువుకుని నా గత జన్మ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నా. నా అహాన్ని నాశనం చేసుకోవడానికి ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకోవాలనుకుంటున్నా. ఇది నా ఆత్మక సంబంధించిన విషయం కావునా, నాకు ఆదివారాలు సెలవు ఇవ్వండి’ అని రాజ్‌కుమార్ యాదవ్ సుస్నేర్ జనపద్ పంచాయత్ సీఈవోకు లేఖ రాశాడు.

Also Read: క్రైం కపుల్స్.. వినూత్న రీతిలో చోరీలు చేసిన ప్రేమికుల జంట.. ఇల్లు అద్దెకిస్తారా అంటూ స్కెచ్

కానీ, ఆయన రాసిన ఈ దరఖాస్తు లేఖతో మొదటికే మోసం వచ్చింది. ‘ప్రియమైన డిప్యూటీ ఇంజనీర్.. నీ అహాన్ని చంపుకోవాలనుకుంటున్నారు కదా. ఇది సంతోషదాయకమైన విషయం. ఇందులో మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి మేం తోడ్పడవచ్చు. ఒక మనిషి తన ఆదివారాలను ఏ విధంగానైనా గడుపుకోగలననే అహాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఇలాంటి అహాన్ని వేరుల నుంచి తీసేయడమే నీకు పురోగతినిస్తుంది. కాబట్టి, నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం మీరు ప్రతి ఆదివారాలూ ఆఫీసుకు హాజరై పనిచేయాలని ఆదేశిస్తున్నాం. తద్వారా ఆదివారాలను సెలవుగా వేడుక చేసుకోవాలనే నీ అహాన్ని ఈ విధంగా నాశనం చేసుకోవచ్చు’ అని జన్‌పద్ పంచాయత్ సీఈవో పరాగ్ పంతి సమాధానం రాశారు. దీంతో డిప్యూటీ ఇంజనీర్ రాజ్‌కుమార్ యాదవ్‌కు మొదటికే మోసం వచ్చింది.

click me!