సీఎం సంచలన నిర్ణయం.. నా కాన్వాయ్ కోసం ప్రజలను ఆపొద్దు.. కార్ల సంఖ్య సగానికి కుదింపు

Published : Oct 10, 2021, 12:39 PM IST
సీఎం సంచలన నిర్ణయం.. నా కాన్వాయ్ కోసం ప్రజలను ఆపొద్దు.. కార్ల సంఖ్య సగానికి కుదింపు

సారాంశం

నా ప్రయాణం కోసం ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టవద్దు. రోడ్లపై ప్రజలను ఆపవద్దు. నేనూ వారితోపాటే రోడ్డుపై ప్రయాణం చేస్తాను. కానీ, ప్రత్యేకంగా వారిని ఆపవద్దు అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించుకున్నారు.  

చెన్నై: రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడెన్‌గా ట్రాఫిక్ నిలిచిపోతుంది. కారణాన్ని ఆరా తీస్తే ఎవరో ప్రజాప్రతినిధి ఆ దారిలో వెళ్తున్నందున ట్రాఫిక్ నిలిపేసినట్టు తెలుస్తుంది. ఈ నిలుపుదల ఒక్కోసారి అరగంట అంతకుపైగా ఉంటుంది. సాధారణ ప్రయాణికులే ఈ అంతరాయానికి రోడ్డుపై విలవిల్లాడుతాడు. అదే ఎమర్జెన్సీ ఉంటే ఆ బాధ చెప్పనలవికాదు. ముఖ్యంగా రాష్ట్ర రాజధానులు, ప్రధాన నగరాల్లో ఇలాంటి ఘటనలు ఎదురవుతుంటాయి. అయితే, నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని tamil nadu CM MK Stalin సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం కాన్వాయ్ కోసం traffic నిలుపవద్దని, వారితోపాటే తానూ వెళ్తారని స్పష్టం చేశారు. అంతేకాదు, తన convoyలోని vehicles సంఖ్యను సగానికి తగ్గించుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు హర్షిస్తున్నారు.

తమిళనాడు సీఎం కాన్వాయ్‌లో 12 వాహనాలున్నాయి. ఇప్పుడు ఈ వాహనాల సంఖ్యను ఆరుకు తగ్గించుకున్నారు సీఎం స్టాలిన్. తాను ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలను ఇబ్బంది పడొద్దని, ట్రాఫిక్ ఆపవద్దని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులకు సూచనలు చేశారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. 

Also Read: యవ్వనంగా కనిపించడానికి మీ సీక్రెట్ ఏంటీ?.. సిగ్గుపడుతూ సీఎం సమాధానం.. వీడియో వైరల్

సీఎం స్టాలిన్ గతంలోనూ తన కాన్వాయ్ కోసం రోడ్లపై ట్రాఫిక్ నిలుపవద్దని పలుసార్లు అధికారులకు చెప్పారు. కానీ, ఈ సూచనలను అధికారులు కచ్చితంగా అమలు చేయలేదు. తాజాగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఈ విషయాన్ని ముందుకు తెచ్చారు. తాను విధులకు వెళ్తున్నప్పుడు సీఎం కాన్వాయ్ కారణంగా డ్యూటీకి అరగంట ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. దీనిపై న్యాయమూర్తి ఎన్ ఆనంద్ వెంకటేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హోం శాఖ కార్యదర్శిని దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. న్యాయమూర్తికి జరిగిన అసౌకర్యానికి హోం శాఖ కార్యదర్శి క్షమాపణలు తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని వివరించారు.

న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశ్ ట్రాఫిక్ నిలుపుదలపై స్పందించిన తరుణంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఇరాయన్బు ఉన్నతాధికారులతో ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలకు ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్