క్షేమంగా వస్తాడు: అభినందన్ తండ్రి ఆశాభావం

By narsimha lodeFirst Published Feb 28, 2019, 3:45 PM IST
Highlights

 పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన తన కొడుకు క్షేమంగా  తిరిగి వస్తాడని ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్ ఆశాభఆవాన్ని వ్యక్తం చేశారు. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన తన కొడుకు క్షేమంగా  తిరిగి వస్తాడని ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్ ఆశాభఆవాన్ని వ్యక్తం చేశారు. 

పాక్ విమానాన్ని వెంటాడుతూ అభినందన్  నడిపిన మిగ్ విమానం బుధవారం నాడు కూలిపోయింది.ఈ ఘటనలో సురక్షితంగా తప్పించుకొని అభినందన్  పాక్ భూభాగంలో దిగాడు. పాక్ ఆర్మీకి బందీగా చిక్కాడు.  

పాక్ ఆర్మీకి అభినందన్ చిక్కిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అభినందన్‌ను సురక్షితంగా భారత్‌కు రప్పించేందుకు విదేశాంగ చర్యలను  చేపట్టింది. తన కొడుకు దేశం కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విపత్కర సమయంలో కూడా అభినందన్‌ ధైర్య సాహసాలు ప్రదర్శించాడన్నారు.

అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరీకీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.అభి బతికి ఉన్నందుకు ఆ దేవుడికి కృతఙ్ఞతలు తెలుపుతున్నా. తను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు. 

పాక్‌ చేతికి చిక్కినా తన కొడుకు చాలా ధైర్యంగా ఉన్నాడు. తను నిజమైన సైనికుడు. తనను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందన్నాడు. మీ మద్దతు మాకెంతో ధైర్యాన్ని ఇస్తోంది. మీ అందరి ఆశీస్సులతో వాడు క్షేమంగా తిరిగి వస్తే చాలునని సింహకుట్టి భావోద్వేగానికి లోనయ్యారు.
 

సంబంధిత వార్తలు

తండ్రి ఫీడ్ బ్యాక్: అచ్చం మణిరత్నం చెలియాలో మాదిరిగానే అభినందన్

click me!