ఆగని కవ్వింపులు: మరోసారి భారత భూభాగంపైకి పాక్ యుద్ధ విమానాలు

By Siva KodatiFirst Published Feb 28, 2019, 2:35 PM IST
Highlights

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్ధితుల్లో యుద్ధం వైపుగా వెళ్లొద్దంటూ రెండు దేశాలకు ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. నిన్ని సాయంత్రం పాక్ నుంచి తీవ్రత తగ్గడంతో చర్చలు జరుగుతాయని అందరూ భావించారు. 

భారత్ కూడా సహనంతో వ్యవహరిస్తోంది. అయితే దాయాది మాత్రం కవ్వింపు చర్యలను మానుకోవడం లేదు. గురువారం ఉదయం మరోసారి పాక్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి.

ఫూంచ్ సెక్టార్‌లోని మెంధర్ ప్రాంతంలోకి పాకిస్తాన్ జెట్ ఫైటర్లు దూసుకొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెంటనే ఎదురుదాడికి దిగడంతో పాక్ విమానాలు తోకముడిచినట్లు రక్షణ శాఖ తెలిపింది.

మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉంది. కృష్ణఘాటీ సెక్టార్‌లో భారత ఔట్ పోస్టులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. వాటిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. 

click me!