ఉపరాష్ట్రపతి పదవిపై వెంకయ్య వైరాగ్యం

By narsimha lodeFirst Published Aug 12, 2019, 11:12 AM IST
Highlights

ఉప రాష్ట్రపతి పదవిని తాను ఏనాడూ ఆశించలేదని వెంకయ్యనాయుడు చెప్పారు. చెన్నైలో తాను రచించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు.

చెన్నై: తాను ఉప రాష్ట్రపతిని కావాలని ఏనాడూ కూడ అనుకోలేదని  వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేస్తే చాలని భావించినట్టుగా ఆయన తెలిపారు.అత్యున్నత పదవిని కట్టబెట్టి పార్టీ తనను గౌరవించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

 లిజనింగ్, లెర్నింగ్, లీడింగ్ పేరుతో వెంకయ్య నాయుడు రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలోని కలైవనర్ ఆరంగంలో  ఆదివారం నాడు జరిగింది.పుస్తకావిష్కరణ తర్వాత వెంకయ్యనాయుడు ప్రసంగించారు.

అమిత్‌షా ముందే ఓ రహస్యాన్ని మీ ముందు ఉంచాలనుకొంటున్నా అని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలను నిత్యం కలుస్తూ, వారి సమస్యలను తెలుసుకొంటూ పార్టీ కోసం పనిచేయడమే తనకు ఇష్టమన్నారు. ఉప రాష్ట్రపతిని కావాలని తాను ఏనాడూ కూడ కోరుకోలేదని ఆయన చెప్పారు.

2020 జనవరి 12వ తేదీన తాను రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకొన్నానని  వెంకయ్యనాయుడు చెప్పారు. న్యూఢిల్లీని ఖాళీ చేసి తన స్వంత జిల్లా నెల్లూరుకు వెళ్లి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. కానీ, అదే సమయంలో తాను ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినట్టుగా వెంకయ్యచెప్పారు.

ఉపరాష్ట్రపతి పదవికి తన పేరును పార్టీ ప్రకటించగానే  తాను కన్నీళ్లు పెట్టుకొన్నట్టుగా వెంకయ్యనాయుడు గుర్తు చేసుకొన్నారు. ఓ సాధారణ రైతు బిడ్డకు పార్టీ అరుదైన అవకాశాన్ని కల్పించిందని  ఆయన  చెప్పారు.

ప్రధానమంత్రి పదవి మినహా ఇతర అన్ని  పదవులను తాను చేపట్టినట్టుగా వెంకయ్య చెప్పారు.  ఉపరాష్ట్రపతి పదవికి తన పేరును ప్రకటించగానే పార్టీకి, పార్టీ పదవులకు బరువెక్కిన హృదయంతో  రాజీనామాను చేసినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.1949లో జన్మించిన వెంకయ్యనాయుడు బీజేపీలో చేరారు. వాజ్‌పేయ్ నేతృత్వంలో, మోడీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని  ఆయన గుర్తు చేసుకొన్నారు.

సంబంధిత వార్తలు

మోడీ, షాలు కృష్ణార్జునులు...ఆర్టికల్ 370 రద్దుని సమర్థించిన రజనీ

 

click me!