న్యాయం కోసం వస్తే: వివాహితపై పోలీస్ అధికారి అత్యాచారం, బెదిరింపులు

By Siva KodatiFirst Published Aug 11, 2019, 6:27 PM IST
Highlights

దల్బీర్ సింగ్‌ది ఆమెది ఒకే జిల్లా కావడంతో బాధితురాలితో తరచుగా మాట్లాడటంతో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఓ రోజు గుర్‌గావ్‌కు వెళ్లడం కోసం బస్టాండ్‌లో ఎదురుచూస్తోంది.. దల్బీర్ ఆమె దగ్గరికి వెళ్లి తాను దిగబెడతానని చెప్పి మహిళను తన కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు.

న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. దానిని అలుసుగా తీసుకుని మహిళపై అత్యాచారం చేశాడో పోలీస్ అధికారి. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని జింద్ జిల్లా ఉద్ధానాకు చెందిన మహిళకు 2017లో వివాహమైంది.

అయితే భర్తతో మనస్పర్థల కారణంగా ప్రతిరోజు ఇద్దరి మధ్యా గొడవలు జరిగేవి. భర్త వేధింపులతో విసిగిపోయిన ఆమె.. ఓ రోజు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.

సదరు స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న దల్బీర్ సింగ్‌ది ఆమెది ఒకే జిల్లా కావడంతో బాధితురాలితో తరచుగా మాట్లాడటంతో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఓ రోజు గుర్‌గావ్‌కు వెళ్లడం కోసం బస్టాండ్‌లో ఎదురుచూస్తోంది.. దల్బీర్ ఆమె దగ్గరికి వెళ్లి తాను దిగబెడతానని చెప్పి మహిళను తన కారులో ఎక్కించుకున్నాడు.

అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు బాధితురాలు అతనిని నిలదీయడంతో తన క్వార్టర్స్‌కి పిలిపించుకుని ఓదారుస్తున్నట్లు నటించి, కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించాడు.

ఆమె మత్తులోకి వెళ్లడంతో మరోసారి అత్యాచారం చేశాడు. ఈ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి... తాను చెప్పినట్లు వినకపోతే వీడియోలు బయటపెడతానని బెదిరించి లోంగదీసుకున్నాడు. పలుమార్లు ఆమెపై అత్యాచారం చేయడంతో వివాహిత కుమిలిపోయింది.

ఈ దారుణాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను గమనించిన మరో పోలీసు వివాహితను కాపాడి జరిగినదంతా తెలుసుకున్నాడు.

దల్బీర్‌కు వ్యతిరేకంగా ఆమె చేతే ఫిర్యాదు చేయించాడు. దదీనిపై అంతర్గత విచారణకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారులు నేరం రుజువుకావడంతో దల్బీర్‌ను అరెస్ట్ చేశారు. కాగా.. అతను మరో ఏడాదిలో పదవి విమరణ చేయనున్నాడు. 
 

click me!