వయనాడ్‌లో రాహుల్ పర్యటన, వరద బాధితులకు పరామర్శ

Siva Kodati |  
Published : Aug 11, 2019, 05:56 PM IST
వయనాడ్‌లో రాహుల్ పర్యటన, వరద బాధితులకు పరామర్శ

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. తన సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన బాధితులను పరామర్శిస్తున్నారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. తన సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన బాధితులను పరామర్శిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి.

పలు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటి వరకు 28 మంది దుర్మరణం పాలవ్వగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. దాదాపు 22,165 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?