వీసీలపై చర్య వెనుక నాకు ఏ ఉద్దేశమూ లేదు.. సుప్రీంకోర్టు సూచనలనే అమలు చేశాను - కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్

By team teluguFirst Published Oct 31, 2022, 2:51 PM IST
Highlights

సుప్రీంకోర్టు సూచనల ఆధారంగానే తాను వీసీలపై చర్యలు తీసుకున్నానని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. అందులో ఎలాంటి వివాదం లేదని అన్నారు. చిన్న చిన్న విషయాలపై చర్చించేందుకు తనకు సమయం లేదని అన్నారు. 

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్‌లపై తీసుకున్న చర్యలను ఆయన సమర్థించుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగ బాధ్యతలను మాత్రమే తాను నిర్వర్తిస్తున్నారని అన్నారు. తాను తీసుకున్న చర్యల వెనుక మరే ఇతర ఉద్దేశ్యం లేదా వివాదం లేదని ఖాన్ స్పష్టం చేశారు. చిన్న చిన్న తగాదాల కోసం సమయాన్ని వృథా చేయలేనని చెప్పారు. ఈ మేరకు ఆదివారం న్యూఢిల్లీలో వరల్డ్ మలయాళీ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖాన్ మాట్లాడారు.

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకారం రాష్ట్రం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీ కనీసం ముగ్గురు వ్యక్తులతో కూడిన ప్యానెల్‌ను సిఫారసు చేసి ఉండాల్సిందని చెబుతూ సుప్రీంకోర్టు అక్టోబర్ 21న ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ నియామకాన్ని రద్దు చేసింది. ఇంజినీరింగ్ సైన్స్ రంగంలోని ప్రముఖులలో ఛాన్సలర్‌కి బదులుగా వేరే ఒకరి పేరును మాత్రమే పంపిందని తెలిపింది. దీంతో పాటు వీసీ నియామకాలపై యూజీసీ నిబంధనల ప్రకారం సెర్చ్ లేదా సెలక్షన్ కమిటీలో నాన్ అకడమిక్ సభ్యుడు ఉండరాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని ఖాన్ చెప్పారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వీసీ విద్యార్హతలపై సుప్రీంకోర్టు విచారణ జరపడం లేదని, దానిపై తాము వ్యాఖ్యానించలేదని గవర్నర్ చెప్పారు. వీసీల నియామకం కోసం అనుసరిస్తున్న ప్రక్రియ యూజీసీ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ‘‘తీర్పు కేవలం ఒక వీసీకి సంబంధించినది కాదు. వారు (సుప్రీంకోర్టు) చట్టాన్ని రూపొందించారు. అది నా అధికార పరిధిలో ఉంటే దానిని సమర్థించడం, అమలు చేయడం నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. అందువల్ల నాకు దీనిని అమలు చేయడంలో ఎలాంటి వివాదమూ కనిపించలేదు. నేను విధిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నాను. చిన్నచిన్న తగాదాల కోసం నాకు సమయం లేదు ’’ అని ఆయన పేర్కొన్నారు.

కేరళ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన విషయం కనిపించినప్పుడు జోక్యం చేసుకునే అధికారం తనకు లేకపోతే దానిని రాష్ట్ర ప్రజల  దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ‘‘ కేరళలోని మంత్రులకు తమ వ్యక్తిగత సిబ్బందిలో 25 మందిని నియమించుకునే అధికారం ఉంది. వారు రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత జీవితకాల పెన్షన్‌కు అర్హులు. ప్రతీ రెండేళ్ల తర్వాత కొత్తగా 25 మందిని నియమిస్తారు. ఈ విధంగా నాలుగు సంవత్సరాల మంత్రి పదవిలో 50 మంది పార్టీ కార్యకర్తలు జీవితకాల పెన్షన్‌కు అర్హులు అవుతారు, ఇది రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించాల్సిన డబ్బు. అందులో నుంచే వారికి ఇస్తారు. దీన్ని ఆపడానికి నాకు చట్టబద్ధమైన అధికారం లేదు. ఇక్కడ కేరళ ప్రజలకు డబ్బు ఎలా ఖర్చు అవుతుందో అనే విషయం మాత్రమే నేను తెలియజేయగలను. మిగితా విషయాలు ప్రజలు నిర్ణయించుకుంటారు.’’ అని అన్నారు.

మోర్బీ వంతెన ఘటనపై ప్రతిపక్షాల ఆగ్రహం.. ప్రధానిని టార్గెట్ చేస్తూ పాత వీడియోలు షేర్ చేస్తున్న నాయకులు

అదే సమయంలో తన ప్రతి అభిప్రాయం పరిపూర్ణమైనదని, అంతిమమైనదని అనుకోబోనని కేరళ గర్నవర్ అన్నారు. తాను సరిదిద్దుకునేందుకు ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో బయట కేరళీయులు వ్యాపారాలు, పరిశ్రమలను విజయవంతంగా నడుపుతున్నారని తెలిపారు. కానీ కేరళలో వాటిని స్థాపించడం లేదని ఆయన పేర్కొన్నారు. కేరళలో కల్తీలేని ఆధ్యాత్మిక మనస్తత్వం ఉందని కొనియాడారు. కేరళ ప్రజలు ఎవరినీ వారి పుట్టుక, చర్మం రంగు, మాట్లాడే భాష ఆధారంగా అనుమానించరని అన్నారు. ప్రతీ ఒక్కరిలో దైవాన్ని చూసే దృక్పథం కేరళ ప్రజలకు ఉందని కొనియాడారు. 
 

click me!