అతిక్ అహ్మద్ లాగే నన్నూ చంపేస్తారని భయమేస్తోంది - యూపీ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్

By Asianet News  |  First Published Apr 29, 2023, 2:31 PM IST

అతిక్ అహ్మద్ లాగే తనను కూడా చంపేస్తారమో అని సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీపై విమర్శలు చేశారు. ఎయిర్ పోర్టులు, రైల్వేలను, ఎర్రకోటను అమ్మేశారని ఆరోపించారు. 


గ్యాంగ్ స్టర్-పొలిటీషియన్ అతిక్ అహ్మద్ లాగే తనను కూడా కాల్చి చంపేస్తారేమో అని భయంగా ఉందని ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆజంఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆజంఖాన్ చాలా కాలం తర్వాత యూపీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అందులో భాగంగా రాంపూర్ లో ఆయన శుక్రవారం సాయంత్రం పర్యటించారు.

‘సోనియా గాంధీ విషకన్య.. ఆమె పాకిస్థాన్, చైనా ఏజెంట్’ - కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు

Latest Videos

రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరఫున ఆయన ప్రచారం చేస్తూ.. యూపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన రాజకీయ ప్రత్యర్థులను ‘రాజకీయ నపుంసకులు’ అని సంబోధించారు. మున్సిపాలిటీ కాంట్రాక్ట్ లో ఉందని, దేశం మొత్తాన్ని కాంట్రాక్ట్ లో పెట్టారని ఆయన ఆరోపించారు. ‘‘ఎర్రకోటను అమ్మేశారు. విమానాశ్రయాలను అమ్మేశారు. పోర్టులు అమ్మేశారు. రైల్వేలు అమ్మేశారు. ఇంకా ఏం మిగిలింది ? ఇక మిగిలింది సైన్యం మాత్రమే. అది హుకుమత్-ఎ-హింద్ తోనే ఉండాలి. మన సైన్యం, ప్రభుత్వ సైన్యం రెండు వేర్వేరు విషయాలు. మా సైన్యం నీది, ఈ సైన్యం అడుగడుగునా పోరాడి విజయం సాధించడం చూశాం’’ అని ఆజంఖాన్ అన్నారు.

ఇక చాలు నాయనా.. 550 మంది పిల్లలకు జన్మనిచ్చిన వ్యక్తిని స్పెర్మ్ డొనేషన్ చేయొద్దని ఆదేశించిన కోర్టు..

‘‘మేము మా ఓటు వేస్తాం. అది మా జన్మహక్కు, కానీ అది కూడా మా నుండి రెండుసార్లు లాక్కున్నారు. మళ్లీ మూడో సారి లాక్కుంటే ఇక ఊపిరి పీల్చుకునే హక్కు కూడా ఉండదు.’’ అని ఆయన తన అనర్హతను ప్రస్తావిస్తూ అన్నారు. కాగా.. గతంలో రాంపూర్ సదర్ నియోజకవర్గం నుంచి ఆజంఖాన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే విద్వేషపూరిత ప్రసంగం కేసులో కోర్టు ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ అక్టోబర్ లో ప్రకటించింది. 2019 ఏప్రిల్ లో రాంపూర్లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదు అయ్యింది.  అయితే వక్ఫ్ బోర్డు ఆస్తుల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న కేసులో అలహాబాద్ హైకోర్టు 2022 మేలో ఆజంఖాన్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

What do you want from me, my children, my wife and my supporters? Do you want somebody shoots at point blank range? : Samajwadi party leader Azam Khan addressing a gathering in favour of a candidate for the municipal elections pic.twitter.com/FmQzHeat1g

— Piyush Rai (@Benarasiyaa)

ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో మొత్తం 760 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. దీంతో పాటు 544 నగర పంచాయతీ ఎన్నికలు, 199 నగర పాలిక పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించనున్నారు. ఈ స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికలు మే 4వ తేదీన, రెండో దశ ఎన్నికలు 11వ తేదీన జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.

click me!