నాలుగు రోజుల కిందటే ఇంట్లో డ్రాప్ చేశా.. మరణంలో ఏదో మిస్టరీ ఉంది - పూనమ్ బాడీగార్డ్

By Sairam Indur  |  First Published Feb 3, 2024, 12:38 PM IST

నటి, మోడల్ పూనమ్ పాండే మరణంలో ఏదో మిస్టరీ ఉందని ఆమె బాడీ గార్డ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను జనవరి 29వ తేదీన ఇంట్లో డ్రాప్ చేశానని చెప్పారు. ఆ సమయంలో ఆమె బాగానే ఉందని, హెల్త్ ప్రాబ్లమ్ ఉందని కూడా తనకు చెప్పలేదని అన్నారు. 


నటి, సోషల్ మీడియా స్టార్ పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో చనిపోయారు. ఈ విషయాన్ని ఆమె టీమ్ నిన్న (ఫిబ్రవరి 2వ తేదీన) అధికారికంగా ప్రకటించింది. మరో నోట్ లో పూనమ్ సోదరి నుంచి ఈ వార్త వచ్చిందని, మరింత సమాచారం త్వరలో తెలుస్తాయని పేర్కొంది. అయితే ఆమె మరణంపై ఎన్నో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఇండియా టుడే’ పూనమ్ బాడీగార్డును సంప్రదించింది. అతడు ఆమెను చివరి సారిగా జనవరి 29వ తేదీన చూశానని, ఇంట్లో డ్రాప్ చేశానని వెల్లడించాడు.

భారతరత్న ఎవరికి ఇస్తారు..? ఎందుకు ఇస్తారు ? అర్హతలేంటి ?

Latest Videos

అయితే ఆ సమయంలో ఆమె బాగానే ఉందని, పూనమ్ అనారోగ్యంతో ఉన్న విషయాన్ని తనకు గానీ, తన సిబ్బంది గానీ ఎప్పుడూ చెప్పలేదని ఆమె బాడీగార్డ్ అమీన్ ఖాన్ అన్నారు. పూనమ్ పాండే మరణం మిస్టరీగా మారిందని ఆయన చెప్పారు. గత పదేళ్లుగా తాను పూనమ్ కు బాడీగార్డుగా ఉన్నానని వెల్లడించాడు. పూనమ్ మరణవార్త తనను కూడా దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఇది నిజమా, అబద్ధమా అనే సందేహం వ్యక్తం అయ్యిందని అన్నారు. పూనమ్ సోదరితో సహా ఆమె కుటుంబ సభ్యులు ఫోన్లకు స్పందించడం లేదని ఆయన పునరుద్ఘాటించారు.

గర్భాశయక్యాన్సర్ తో 32 యేళ్లకే చనిపోతారా? ప్రమాదం ఎంత?

‘‘నేను చివరిసారిగా జనవరి 29న పూనమ్ పాండే దగ్గర నుంచి బయలుదేరాను. ముంబైలో రోహిత్ వర్మతో కలిసి ఫోటో షూట్ చేశాం. ఆ తర్వాత ఆమెను ఇంట్లో దింపాను. ఆమె నాకు గానీ, సిబ్బందికి గానీ హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పలేదు.’’ అని ఆయన అన్నారు. ‘‘మేము ఆమె ఇంటికి వెళ్లాము. కానీ వాచ్ మెన్ ఎవరినీ లోపలికి అనుమతించలేదు.’’ అని చెప్పారు. 

భర్త శాడిజం.. 12 ఏళ్లుగా ఇంట్లోనే భార్య బందీ.. కిటికీ ద్వారానే పిల్లల బాగోగులు..

కాగా.. పూనమ్ పాండే మరణంపై చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి గర్భాశయ ముఖద్వార కాన్సర్‌ తో మరణించడం చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదీ ఇంత సడెన్ గా జరగదని పేర్కొంటున్నారు. యాభై ఏళ్లలోపు ఉన్న వాళ్లు ఈ కాన్సర్‌కి గురైతే ట్రీట్‌మెంట్‌ ద్వారా బతికే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం పూనమ్‌ పాండే వయసు 32ఏళ్లే. ఇటీవలే ఆమె పెళ్లి చేసుకుంది. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని, ఆమె మరణ వార్త ఫేక్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. 
 

click me!