రెండు స్థానాల నుండి అధికారం వరకు: బీజేపీ విస్తరణలో అద్వానీదే కీలకపాత్ర

By narsimha lode  |  First Published Feb 3, 2024, 12:20 PM IST

బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీ కీలక పాత్ర పోషించారు.   


న్యూఢిల్లీ: భారత దేశంలో  భారతీయ జనతా పార్టీ రెండు స్థానాల నుండి  కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదగడంలో  మాజీ కేంద్ర హోం శాఖ మంత్రి లాల్ కృష్ణ అద్వానీ కీలక పాత్ర పోషించారు.దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంలో  అద్వానీ పాత్రను ఎవరూ కాదనలేరు.  రథయాత్రల ద్వారా బీజేపీలో ఊపు తీసుకొచ్చిన చరిత్ర  అద్వానీది.మాజీ కేంద్ర మంత్రి అద్వానీకి భారతరత్న పురస్కారం దక్కింది.మాజీ కేంద్ర మంత్రి లాల్ కృష్ణ అద్వానీకి  కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. 

also read:ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్: రంగంలోకి నందిని, కాంగ్రెస్‌లో పోటాపోటీ

Latest Videos

1927 నవంబర్  8వ తేదీన అద్వానీ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న సింధ్ ప్రాంతంలోని  కరాచీలోని సంపన్న వ్యాపారవేత్త  కిషన్ చంద్  అద్వానీ, జియాని దేవి దంపతులకు జన్మించారు.పాకిస్తాన్ లోని హైద్రాబాద్ లోనే ఆయన  విద్యాభ్యాసం సాగింది.  ఆ సమయంలోనే ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చేరారు. దేశ విభజన తర్వాత  1947 సెప్టెంబర్ 12న అద్వానీ  భారత్ కు తరలివచ్చారు.

also read:కుమారీ ఆంటీపై డీజే సాంగ్: సోషల్ మీడియాలో వైరల్

ఇంజనీరింగ్  చదువును కూడ వదిలేసి  అద్వానీ ఆర్ఎస్ఎస్ లో పనిచేశాడు.శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన  భారతీయ జనసంఘ్ లో  ఆయన చేరారు. రాజస్థాన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడికి సలహాదారుడిగా కూడ అద్వానీ పనిచేశారు.1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఎన్నికల్లో  జనసంఘ్ తరపున ఆయన  పోటీ చేసి విజయం సాధించారు.  ఢిల్లీ మున్సిఫల్ కార్పోరేషన్ అధ్యక్షుడయ్యారు.  

also read:తాటిచెట్లకు తాళాలు: కల్లుగీత కార్మికుల వినూత్న ఆలోచన, ఎందుకంటే?

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో  దేశంలో ఎమర్జెన్సీని  విధించింది. ఎమర్జెన్సీ తర్వాత జనసంఘ్ జనతా పార్టీలో విలీనమైంది.  1977లో జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.  మొరార్జీ దేశాయ్  కేబినెట్ లో లాల్ కృష్ణ అద్వానీ  సమాచార, ప్రసార శాఖ మంత్రిగా కూడ పనిచేశారు.కేంద్రంలోని జనతా ప్రభుత్వం  కుప్పకూలిన తర్వాత ఆ పార్టీ కూడ పతనమైంది.  అదే సమయంలో  జనసంఘ్ నుండి వేరుపడి  భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. 

1982లో  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి రెండు లోక్ సభ స్థానాలు మాత్రమే దక్కాయి. కానీ, ఆ తర్వాత బీజేపీ  క్రమంగా బలం పుంజుకుంది. బీజేపీ బలం పెంచుకోవడంలో అద్వానీ కీలకంగా వ్యవహరించారు.1986 లో  బీజేపీ అధ్యక్ష పదవిని  ఎల్.కె. అద్వానీ చేపట్టారు.  రెండు పార్లమెంట్ స్థానాల నుండి  బీజేపీ క్రమంగా బలాన్ని పెంచుకొంది.  అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఆపార్టీ దేశ వ్యాప్తంగా తన బలాన్ని విస్తరించుకొంది.  1989లో ఆ పార్టీ 86 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. రథయాత్రలతో బీజేపీని బలోపేతం చేసే విషయమై  అద్వానీ వ్యూహాలు ఫలించాయి.  దీంతో ఆ పార్టీ అన్ని రాష్ట్రాల్లో  బలపడింది.  ఉత్తరాదిలో ఆ పార్టీ  కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. 

1990 సెప్టెంబర్  25న సోమనాథ్ దేవాలయం నుండి అయోధ్య వరకు  అద్వానీ  రథయాత్రను చేపట్టారు. అయితే  ఈ యాత్ర బీహార్ లో రాష్ట్రంలో నిలిచిపోయింది. ఆనాడు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్  అద్వానీ రథయాత్రను నిలిపివేయించారు.  ఈ యాత్ర సందర్భంగా అద్వానీ  పేరు దేశమంతా మార్మోగింది. అప్పట్లో  కాంగ్రెసేతర ప్రధానిగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వానికి  బీజేపీ  మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో పార్లమెంట్ కు  మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.1991లో జరిగిన ఎన్నికల్లో  బీజేపీ  120  ఎంపీలను గెలుచుకుంది.   ఆ తర్వాత అయోధ్యలో కరసేవ అంశం అప్పట్లో దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. 1996 లో  జరిగిన ఎన్నికల్లో  బీజేపీ తొలిసారిగా  కేంద్రంలో అధికారాన్ని దక్కించుకుంది. 13 రోజులకే ఈ ప్రభుత్వం కూలిపోయింది. 1998 ఎన్నికల్లో బీజేపీ రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది.  అన్నాడిఎంకె  మద్దతు ఉపసంహరించడంతో మరోసారి ఈ ప్రభుత్వం కూలిపోయింది.  1999లో మరోసారి బీజేపీ  అధికారంలోకి వచ్చింది.

1992లో అయోధ్యలో  జరిగిన కరసేవ సందర్భంగా అద్వానీ అరెస్టయ్యారు.  1986లో  బీజేపీకి  అటల్ బిహారీ వాజ్ పేయ్ నుండి అద్వానీ  1991లో పార్టీ పగ్గాలు స్వీకరించారు. 1993నుండి  1998 వరకు  కూడ  ఆయన మరోసారి బాధ్యతలు చేపట్టారు.  2004 నుండి  2005 వరకు  కూడ  అద్వానీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు.

2004లో  కేంద్రంలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది.  ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడ బీజేపీ అధికారాన్ని  కోల్పోవాల్సి వచ్చింది.  దీంతో  అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్నారు.  వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో  ఆయన మంత్రివర్గంలో అద్వానీ పనిచేశారు.  1998  నుండి  2004 వరకు  డిప్యూటీ ప్రధాన మంత్రిగా కూడ ఆయన పనిచేశారు. అద్వానీని ఉక్కు మనిషిగా కూడ పిలుస్తారు.   
 

click me!