Hyderabad: తనతో కలిసి లిక్కర్ తాగలేదని భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య

Published : May 17, 2023, 08:31 PM IST
Hyderabad: తనతో కలిసి లిక్కర్ తాగలేదని భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య

సారాంశం

హైదరాబాద్‌లో ఓ తాగుబోతు భర్త.. భార్యను తనతో కలిసి తాగాలని బలవంతం చేశాడు. నోట్లో లిక్కర్ పోశాడు. ఆమె ప్రతిఘటించడంతో కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేశాడు. ఈ ఘటన ఈ నెల 15వ తేదీ, 16వ తేదీల మధ్య రాత్రి జరిగింది.  

హైదరాబాద్: ఓ తాగుబోతు తన భార్యను తరుచూ వేధించాడు. తప్ప తాగి ఇంటికి వచ్చి నానా రభస చేశాడు. మద్యం తాగొద్దని అన్నందుకు భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తర్వాత బయటికి వెళ్లి మళ్లీ తాగి అర్థరాత్రి దాటిన తర్వాత ఇంటికి మద్యం బాటిల్ తెచ్చాడు. పడుకున్న భార్యను లేపి తనతో మద్యం తాగాలని బలవంత పెట్టాడు. నోట్లో లిక్కర్ పోశాడు. వారించిన భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో మే 15వ తేదీ (16వ తేదీ తెల్లవారుజాము) అర్థరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది.

30 ఏళ్ల సున్నాల యాదయ్య ఆటో డ్రైవర్. ఆయన భార్య మమత కొందుర్గులోని ఓ పరిశ్రమలో పని చేసేది. ఇద్దరికి 13 ఏళ్ల క్రితమే పెళ్లి జరిగింది. ముగ్గురు పిల్లల సంతానం ఉన్నది.

మే 15వ తేదీన యాదయ్య మద్యం తాగి లిక్కర్ బాటిల్ పట్టుకుని వచ్చాడు. ఇది వారిద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఆ తర్వాత యాదయ్య ఇల్లు వదిలి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 2.30 గంటలు దాటిన తర్వాత ఆయన తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే మమత నిద్రపోయింది.

Also Read: భార్య ప్రైవేట్ పార్టులపై గొడ్డలి, కొడవలితో దాడి చేసి దారుణ హత్య.. అనంతరం భర్త ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం, ఇంటికి వచ్చిన యాదయ్య తన భార్య మమతను నిద్రలేపాడు. తనతో మద్యం తాగాలని బలవంతపెట్టాడు. బలవంతంగా ఆమె నోటిలో లిక్కర్ పోశాడు. ఆమె ప్రతిఘటించడంతో ఓ సాకెట్‌లో వైర్ పెట్టి ఆమెకు షాక్ ఇచ్చాడు.

మమతా కుటుంబానికి యాదయ్యపై అనుమానాలు వచ్చాయి. షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదయ్య తనను తరుచూ వేధిస్తున్నాడని మమత తనకు చెప్పిందని ఆమె తండ్రి వీ వెంకటయ్య తెలిపారు.

మమత తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. యాదయ్యను కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం, తానే హత్య చేసినట్టు యాదయ్య పోలీసుల ముందు అంగీకరించాడు. ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

మీ దగ్గర ఈ 2 రూపాయల నోటు ఉందా..? అయితే లక్షలాది డబ్బు సొంతం అవుతుందట..!
2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu