బంగారు గొలుసు అమ్మనివ్వలేదని.. భార్యను చంపి, మృతదేహాన్ని 6 ముక్కలుగా నరికిన భర్త..

By SumaBala Bukka  |  First Published Sep 16, 2023, 8:49 AM IST

ఓ వ్యక్తి భార్యను హత్య చేసి, మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి గంజాం జిల్లాలోని రుషికుల్య నదిలో పడేశాడు. దీనికి గానూ చంపినందుకు 28 ఏళ్ల కార్మికుడిని శుక్రవారం అరెస్టు చేశారు.


ఒడిశా : బుధవారం రాత్రి గంజాం జిల్లాలో భార్యను హత్య చేసిన కేసులో ఓ వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను హత్యచేసిన సదరు 28 ఏళ్ల కార్మికుడు ఆ తరువాత మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి, రుషికుల్య నదిలో పడేశాడు. 

దీనికి సంబంధించిన వివరాల ప్రకారం, భగబన్‌పూర్ గ్రామానికి చెందిన నారాయణ్ మూలి తన భార్య బంగారు గొలుసు అడిగాడు. అది అమ్మి చిన్న వ్యాపారం చేస్తాననుకుంటానని చెప్పాడు. కానీ దీనికి భార్య బులి (22) ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది గొడవకు దారి తీసి బులి గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. నారాయణ్ మూడు నెలల క్రితం బులిని ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. 

Latest Videos

నిద్రిస్తున్న దంపతులను నరికి చంపేసి, కూతురును హతమార్చేందుకు యత్నం.. రాళ్లతో కొట్టి ప్రాణం తీసిన స్థానికులు

ఈ హత్య విషయం బులి తల్లి ఝును మూలి గురువారం కూతురు అదృశ్యంపై అల్లుడిపై అనుమానాలున్నట్లు తెలపడంతో వెలుగులోకి వచ్చింది. జాగిలిపాడు గ్రామానికి ఝును మూలికి అల్లుడు భార్య కనిపించడంలేదని చెప్పడంతో.. అనుమానం వచ్చింది. దీంతో అల్లుడిపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. 

నారాయణ్ మూలి తన భార్య కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులకు, పోలీసులకు తెలిపాడు. అయితే, విచారణలో నారాయణ్ తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు చెప్పిన దాన్ని చెబుతూ.. నారాయణ్ తన భార్యను హత్య చేసిన తరువాత ఆమె మృతదేహాన్ని నది ఒడ్డుకు తీసుకువెళ్లి,  గొడ్డలితో ఆరు ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు శరీర భాగాలను నదిలో పడేశాడు. పోలీసులు గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు గంజాం ఎస్పీ జగ్మోహన్ మీనా తెలిపారు.

click me!