కొడుకు తెల్లగా పుట్టాడని.. భార్య గొంతునులిమి చంపిన భర్త.. జీవితఖైదు..

Published : Aug 10, 2023, 02:44 PM IST
కొడుకు తెల్లగా పుట్టాడని.. భార్య గొంతునులిమి చంపిన భర్త.. జీవితఖైదు..

సారాంశం

కొడుకు తెల్లగా పుట్టడంతో భార్య మీద అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను అతి దారుణంగా హతమార్చాడు. అతనికి కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది.   

తమిళనాడు : కొడుకు శరీర రంగుపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్యను అతి దారుణంగా హత మార్చాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని చెన్నైలో వెలుగు చూసింది. బిడ్డ తెల్లగా పుట్టాడని భార్య శీలాన్ని అనుమానించి.. గొంతు నులిమి చంపేశాడు. దీనిమీద కేసు నమోదు కావడంతో మైలాడుదురై కోర్టు కిరాతకుడైన ఆ భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.  

ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..అయ్యప్పన్ (32)  అచ్చికాడుకు చెందిన వ్యక్తి. 2012లో అతనికి అదే గ్రామానికి చెందిన అఖిల అనే మహిళతో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి వయసు వరుసగా 9,7 సంవత్సరాలు. 

మణిపూర్ లో మరో మహిళపై గ్యాంగ్ రేప్.. ఆలస్యంగా వెలుగులోకి..

ఇద్దరు కొడుకుల్లో ఒకరు నల్లగా ఉన్నారు.. మరొకరు తెల్లగా ఉన్నాడు. దీంతో కొద్దికాలంగా అయ్యప్పని భార్య శీలం పై అనుమానం వచ్చింది. ఈ విషయంపై తరచుగా ఆమెతో గొడవలు పడుతుండేవాడు. ఓ రోజు ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. 

విషయం వెలుగులోకి రావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి అయ్యప్పన్ను అరెస్టు చేశారు. దీంతో కేసు విచారణ మైలాడుదురై కోర్టులో జరిగింది. కేసుకు సంబంధించిన సాక్షాదారాలను పరిశీలించిన కోర్టు అయ్యప్పన్ ను దోషిగా నిర్ధారించింది.  

ఈ కేసులో అతనికి  జీవితకాలం కారాగార శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. మైలాడుదురైలో జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు  ఏర్పాటైన తర్వాత ఓ హత్య కేసులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పుని ఇవ్వడం ఇదే మొదటిసారి.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..