భారత్‌లోకి ఎంటరైన కరోనా కొత్త వేరియంట్.. మహారాష్ట్రలో వెలుగులోకి , లక్షణాలివే

By Siva Kodati  |  First Published Aug 10, 2023, 2:36 PM IST

యూకేలో వెలుగుచూసిన ఈజీ.5 వేరియంట్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రస్తుతం అమెరికా, భారత్‌లోకి కూడా ఈ వేరియంట్ అడుగుపెట్టినట్లుగా నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఈజీ.5 వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం ఇప్పటికే ధ్రువీకరించింది.


దాదాపు మూడున్నరేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి బారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. అయితే ఈ ముప్పు ఇప్పట్లో తొలగిపోదని.. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో ఈ మానవాళిని కరోనా ఇబ్బంది పెడుతూనే వుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూకేలో వెలుగుచూసిన ఈజీ.5 వేరియంట్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. అంతేకాదు.. ఈ వైరస్ అత్యంత వేగవంగా ఇతర దేశాలకు సైతం విస్తరిస్తోంది. ప్రస్తుతం అమెరికా, భారత్‌లోకి కూడా ఈ వేరియంట్ అడుగుపెట్టినట్లుగా నిపుణులు చెబుతున్నారు. 

మహారాష్ట్రలో ఈజీ.5 వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం ఇప్పటికే ధ్రువీకరించింది. ఎరిస్ అని పిలిచే ఈ కొత్త వేరియంట్ కేసులో మే నెలలోనే వెలుగుచూశాయని, రెండు నెలలు గడుస్తున్నా ఈ కేసుల్లో పెరుగుదల లేకపోవడం ఊరట కలిగించే విషయంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌లో కలిగిన ఉత్పరివర్తనం, జన్యుపరమైన మార్పుల కారణంగానే ఈ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌లో కనిపించిన లక్షణాలే తాజా వేరియంట‌్‌లోనూ కనిపిస్తాయని అధికారులు తెలిపారు. తలనొప్పి, ఆయాసం, ముక్కు కారడం, తుమ్ములు కనిపిస్తాయని అయితే బాధితులు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్ధితి రాలేదన్నారు.

Latest Videos

ALso Read: బాబోయ్ : 113 మ్యూటేషన్లతో కరోనా కొత్త వేరియంట్ , ఇండోనేషియాలో వెలుగులోకి .. ప్రపంచానికి మరో ముప్పు తప్పదా..?

మహారాష్ట్ర ప్రభుత్వ వివరాల ప్రకారం.. జూలై చివరి నాటికి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 70 కాగా, ఆగస్టులో 115కి పెరిగాయి. గత సోమవారం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 109కి తగ్గిందని అధికారులు చెప్పారు. రాష్ట్ర రాజధాని ముంబైలో అత్యధికంగా 43 కేసులు, పూణేలో 34, థానేలో 25, రాయ్‌గఢ్, సంగ్లీ, షోలాపూర్, పూణే, పాల్ఘర్‌లలో ఒక్కో యాక్టివ్ కేసు వున్నట్లు మహారాష్ట ప్రభుత్వం వెల్లడించింది. 

click me!