పక్కింటి యువకుడితో భార్య పాడుపని.. కోపంతో కొట్టి చంపి, మృతదేహాన్ని స్కూటీపై తీసుకువెడుతూ...

Published : Mar 06, 2023, 09:48 AM IST
పక్కింటి యువకుడితో భార్య పాడుపని.. కోపంతో కొట్టి చంపి, మృతదేహాన్ని స్కూటీపై తీసుకువెడుతూ...

సారాంశం

పక్కింటి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను కొట్టి చంపాడో భర్త. ఆ తరువాత మృతదేహాన్ని స్కూటీపై తీసుకెళ్లి మాయం చేయాలనుకున్నాడు. 

బీహార్ : వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నా.. వాటి మాయలో పడకుండా ఉండలేకపోతున్నారు. దీంతో నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది.. తెలిసీ.. చేసే ఈ తప్పులతో ఒకరు బాధితులుగా.. మరొకరు నేరస్తులుగా మారుతున్నారు. ఇలాంటి ఘటనే బీహార్ లో చోటు చేసుకుంది. వివాహిత అయిన ఓ మహిళ.. పక్కింటి యువకుడితో  వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచుతున్నానని అనుకుంది. భర్తతో సహా ఎవరికి తెలియదని  భావించింది. కానీ ఈ విషయం ఊర్లో వాళ్లకు తెలిసి వారి ద్వారా భర్తకు చేరింది.

దీంతో తట్టుకోలేని ఆగ్రహావేషాలతో ఆ భర్త దారుణమైన కృత్యానికి ఒడిగట్టాడు. భార్యను కొట్టి కొట్టి చంపేశాడు. బీహార్ లోని బంకాలో ఈ ఘటన సంచలన కేసుగా మారింది. సదరు మృతురాలి పేరు శిల్పాకుమారి. భర్త ఉండగానే పక్కింటి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది తెలిసిన భర్త సంజయ్ ఆమెను తీవ్రంగా కొట్టి చంపేశాడు. తన మేనల్లుడితో కలిసి.. శిల్పా కుమారి మృతదేహాన్ని  మాయం చేయాలని ప్రయత్నించాడు. అందుకోసం స్కూటీపై తీసుకువెళ్లాడు. అయితే ఈ విషయం ఎలాగో పోలీసులకు సమాచారం అందింది.

చైనీస్ సీసీటీవీ కెమెరాలను నిషేధించండి.. పొంచి ఉన్న ముప్పును అరికట్టండి - ప్రధానికి మాజీ కేంద్ర మంత్రి లేఖ

వెంటనే పోలీసులు సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే హత్య చేసినట్లుగా నిందితుడు సంజయ్ ఒప్పుకున్నాడు. దీంతో  సంజయ్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకి వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన భర్త దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలా చేయడం వల్ల మామూలుగా అయితే అవమానకరంగా ఫీల్ అయ్యి.. ఆ సంబంధానికి దూరంగా ఉంటారని భావించాడు ఆ భర్త. కానీ, ఆ ప్రియుడు మాత్రం ఆ భర్త మీద ప్రతీకార చర్యకు దిగాడు. తమ సంబంధాన్ని భర్త బయట పెట్టడం భరించలేకపోయాడు. పైశాచికంగా వ్యవహరించాడు. ఆ భర్తకి శిరోమండనం చేయించడమే కాకుండా..  అతని మీద మూత్రం పోశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

తిరుపతిలోని చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు.... హర్షవర్ధన్ అనే  వ్యక్తి గురించి ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. సదరు హర్షవర్ధన్ అనే వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడని… RIP (రిప్) అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు.  ఇది సదరు ప్రియుడు హర్షవర్ధన్ చూసాడు. కోపంతో రగిలిపోయాడు.  తనమీద అలా పెట్టిన వ్యక్తికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. సదరుబాదితుడిని పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లి గుండు కొట్టించాడు. 

అంతటితో అతని పైశాచిక ఆనందం తీరలేదు. అతని మీద మూత్రం పోసాడు. అంతేకాదు దీనికి సంబంధించి పోలీసులకు గనక ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారు చోద్యం చూస్తూ నిలబడ్డారే కానీ.. ఆపే ప్రయత్నం చేయలేదు.  పైగా ఫోటోలు వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. విషయం పోలీసుల దాకా చేరింది. వెంటనే దీనిమీద దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని నిర్ధారించుకున్నారు.  

హర్షవర్ధన్ తో పాటు, అతని అనుచరుడైన అన్వర్ ను.. ఈ ఘటనలో వీరికి సహకరించిన మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే దారుణం.. అయితే ఆ ప్రియుడు తన మీద దాడి చేయడం.. మరింత అవమానం దీన్ని తట్టుకోలేక ఆ భర్త అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా సమాచారం.

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు