సీరియల్ వివాదం.. ఛానల్ మార్చడం విషయంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్మ..

Published : Oct 17, 2023, 10:10 AM IST
సీరియల్ వివాదం.. ఛానల్ మార్చడం విషయంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్మ..

సారాంశం

టీవీలో సీరియల్ చూస్తున్న భార్యను ఛానల్ మార్చమని అడిగాడో భర్త. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. 

తమిళనాడు : తమిళనాడు తిరువల్లూరు జిల్లా కడంబత్తూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. టీవీ సీరియల్ వివాదం ఓ భర్త బలవన్మరణానికి కారణమయ్యింది. తిరువల్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన ఆశీర్వాదం, నిషా భార్యాభర్తలు. భార్య  నిషా టీవీలో ఏదో సీరియల్ చూస్తోంది. ఆ సమయంలో టీవీ ఛానల్ మార్చాలని ఆశీర్వాదం నిషాను అడిగాడు.

కానీ, నిషా దానికి అంగీకరించలేదు. ఛానల్ మార్చకపోవడంతో దంపతుల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా కోసానికి వచ్చిన నిషా తన పుట్టింటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తీసి చూసేసరికి ఆశీర్వాదం ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. షాక్ అయిన నిషా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీనిమీదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu