ఐటీ శాఖ దూకుడు..  నాలుగు రాష్ట్రాల్లో 55 చోట్ల దాడులు..  రూ.94 కోట్ల నగదు, రూ.8 కోట్ల బంగారం స్వాధీనం

Published : Oct 17, 2023, 05:56 AM IST
ఐటీ శాఖ దూకుడు..  నాలుగు రాష్ట్రాల్లో 55 చోట్ల దాడులు..  రూ.94 కోట్ల నగదు, రూ.8 కోట్ల బంగారం స్వాధీనం

సారాంశం

కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సోమవారం వెల్లడించింది. ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్ల ఇళ్లపై ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో రూ.94 కోట్ల నగదు, రూ.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, 30 లగ్జరీ వాచీలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది

కేంద్ర ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.  అక్టోబర్ 12న కొందరు ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, మరికొందరు సహచరులపై సెర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్ నిర్వహించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, న్యూఢిల్లీ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ సోదాల్లో సుమారు రూ.94 కోట్ల నగదు, రూ.8 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు, 30 లగ్జరీ రిస్ట్ వాచీలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. తదుపరి విచారణ ప్రక్రియలో ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సమాచారం ఇస్తూ తెలిపింది.

55 చోట్ల దాడులు
 
బెంగళూరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలోని కొన్ని నగరాల్లోని మొత్తం 55 ప్రాంగణాల్లో డిపార్ట్‌మెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.94 కోట్ల నగదు, రూ. 8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, మొత్తం రూ.102 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుల గుర్తింపును వెల్లడించకుండా, ఒక ప్రైవేట్ జీతభత్యాల ఉద్యోగి ఆవరణలో సుమారు 30 లగ్జరీ రిస్ట్ వాచీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే వాచీల వ్యాపారంతో అతడికి ఎలాంటి సంబంధం లేదు. ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ పేరు వెల్లడించలేదు. కాంట్రాక్టర్లు , వారితో సంబంధం ఉన్న వ్యక్తుల స్థానాలపై దాడులు నిర్వహించినప్పుడు.. నేరాలలో వారి 'ప్రమేయం'కు సంబంధించిన డాక్యుమెంట్లు , వారి హార్డ్ కాపీలు, డిజిటల్ డేటాతో సహా చాలా ఆధారాలు లభించాయని చెప్పబడింది.  

నగదు వ్యవహారంపై కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సోదాల్లో దొరికిన డబ్బు కాంగ్రెస్‌కు చెందినదని కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ చెప్పగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు 'నిరాధారమైనవి' అని పేర్కొన్నారు. CBDT ఆదాయపు పన్ను శాఖ కోసం విధానాలను రూపొందిస్తుంది.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu