
చెన్నై : tamilnaduలోని రాణిపేట్ జిల్లాలో విస్మయకర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి youtube videos చూసి, భార్యకు ఇంట్లోనే delivery procedure చేశాడు. ఫలితంగా Dead babyని ప్రసవించిన ఆమె over bleedingతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల వివరాల ప్రకారం... పానపక్కం ప్రాంతంలో దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తికి ఏడాది క్రితం వివాహం అయింది కొన్నాళ్లకు భార్య (28) గర్భం దాల్చింది.
నెలలు నిండడంతో డిసెంబర్ 18న ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లే బదులు.. ఇంట్లోనే బిడ్డను ప్రసవించేలా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్ వీడియోలు చూడడంతో పాటు, సోదరిని అడిగి తెలుసుకున్నాడు. అయితే, ఇలా చేస్తున్న క్రమంలో చాలా సేపటికి ఆమె ప్రసవించింది. కాగా, బిడ్డ చనిపోయింది. మరోవైపు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. దీనిపై విచారణ జరుపుతున్నామని.. ఇంకా ఎవరిపై కేసు నమోదు చేయలేదని చెప్పారు. భార్య అనుమతి తోనే అతడు డెలివరీ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారని వెల్లడించారు.
దారుణం : యూట్యూబ్ లో చూసి అబార్షన్లు.. ఓ ఫేక్ డాక్టర్ నిర్వాకం.. !!
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ లో మహారాష్ట్రలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువతి మీద కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో.. ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయం అందరికీ తెలిస్తే తన పరువు పోతుందని బాధితురాలు బావించింది. అంతేకాదు.. ఆ గర్భం తొలగించుకోవాలని ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కూడా ఒత్తిడి చేశాడు. దీంతో.. అతని బలవంతం మేరకు ఆ గర్భం ఎలాగైనా తీసేయాలని అనుకుంది.
ఈ క్రమంలో.. యూట్యూబ్ లో చూసి తనకు తాను స్వయంగా అబార్షన్ చేసుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె ఏడు నెలల గర్భాన్ని బలవంతంగా తొలగించుకుని ఒక మృతశిశువుకు జన్మనిచ్చింది. అబార్షన్ చేసుకునేందుకు తన ఇంట్లో అందుబాటులో ఉన్న పరికరాలను వినియోగించింది. ఫలితంగా ఆమె శరీరానికి ఇన్షెక్షన్ సోకడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆమెపై అత్యాచారం జరిపిన వ్యక్తే అమెను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. అతనికి అప్పటికే వివాహం కావడంతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 2016 నుంచి తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అప్పటినుంచి పలుమార్లు తనను శారీకరంగా కలిశాడని పేర్కొంది. ఈ నేపధ్యంలోనే గర్భవతిని అయ్యానని, అయితే తనను అబార్షన్ చేయించుకోవాలని అతను ఒత్తిడి చేశాడని, పెళ్లి చేసుకునేందుకు కూడా నిరాకరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు సోహెల్ వాహబ్ ఖాన్ ను అత్యాచార ఆరోపణలపై అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.