కర్వాచౌత్ నాడు ఉపవాసం చేస్తున్న భార్యపై భర్త దాడి.. 12 కత్తిపోట్లతో మహిళ పరిస్థితి విషమం...

Published : Oct 14, 2022, 07:22 AM IST
కర్వాచౌత్ నాడు ఉపవాసం చేస్తున్న భార్యపై భర్త దాడి.. 12 కత్తిపోట్లతో మహిళ పరిస్థితి విషమం...

సారాంశం

భర్త ఆరోగ్యం కోసం ఉపవాసం చేస్తున్న భార్యమీద కత్తితో దాడిచేశాడో భర్త... 12 చోట్ల విచక్షణారహితంగా పొడవడంతో ఆమె ప్రాణాపాయస్థితిలో పోరాడుతోంది. 

ఉత్తర ప్రదేశ్ :  ఉత్తరప్రదేశ్లోని  హర్దాయ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ఆరోగ్యంగా ఉండాలని భార్య ఉపవాసం చేయగా.. అతనే ఆమె మీద కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని హర్దాయ్ లో కలకలం రేపింది. భర్త దీర్ఘకాలం పాటు ఆరోగ్యంతో ఉండాలని ఉత్తరాది మహిళలు కర్వాచౌత్ ను అత్యంత భక్తిశ్రద్ధలతో, నిష్టగా చేస్తారు. అత్యంత వేడుకగా దీన్ని నిర్వహించుకుంటారు. 

గురువారం కర్వాచౌత్ పండుగ కావడంతో కొట్ వాలీ ఆజాద్ నగర్ కు చెందిన మౌనీగుప్తా ఉదయం నుంచి ఉపవాసం చేస్తోంది. అయితే సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త మనోజ్..ఆమె ఉపవాస దీక్షను విరమింపచేయాల్సింది పోయి.... ఒక్కసారిగా పదునైన కత్తితో భార్య మీద విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా శరీరంపై 12 చోట్ల తీవ్రంగా గాయపరిచాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఘటనా స్థలంనుంచి పరారయ్యాడు. 

కేరళ నరబలి కేసు: పోస్టుమార్టం పూర్తి.. వెలుగులోకి మ‌రిన్ని విష‌యాలు

సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం  ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. అయితే, మోనీ-మనోజ్ కు 22 యేళ్ల క్రితం వివాహమయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా భర్త మనోజ్ మోనీని వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనకు మూడు రోజుల ముందు సైతం మనోజ్ మోనీని కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

అయితే, పోలీసులు ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. దీంతో పరిస్థితి ఇంతకు దిగజారింది. మనోజ్ ఒక్కసారిగా భార్యపై దాడి చేయడానికి, హత్యాయత్నం చేయడానికి కారణం విషయమై సరైన సమాచారం లేదు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిందని కోపంతోనే అతను ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu