హుబ్బళ్లి రైల్వేస్టేషన్ కు గిన్నిస్ రికార్డులో చోటు.. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌గా గుర్తింపు

Published : Mar 14, 2023, 03:46 PM ISTUpdated : Mar 14, 2023, 03:54 PM IST
హుబ్బళ్లి రైల్వేస్టేషన్ కు గిన్నిస్ రికార్డులో చోటు.. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌గా గుర్తింపు

సారాంశం

కర్ణాటకలోని హుబ్బళ్లి రైల్వేస్టేషన్ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. 1,507 మీటర్ల పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ ను ఈ స్టేషన్ లో ఇటీవల ప్రధాని  మోడీ ప్రారంభించారు. దీంతో ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ గా గుర్తింపు పొందింది. 

కర్ణాటకలోని హుబ్బళ్లి రైల్వేస్టేషన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ రికార్డు ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ పై ఉంది. ఆ స్టేషన్ 1,366 మీటర్ల పొడవైన ప్లాట్ ఫామ్ ను కలిగి ఉంది. అయితే ఆ రికార్డును  హుబ్బళ్లి రైల్వేస్టేషన్ అధిగమించింది. ఇటీవల 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ ను ఈ స్టేషన్ లో నిర్మించారు. ఇది గత ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది. జనవరి 12న ప్లాట్‌ఫారమ్‌ పొడవును ధృవీకరించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది.

టెర్రర్ ఫండింగ్ కేసు: జ‌మ్మూకాశ్మీర్ లోని ప‌లు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

రూ.20.1 కోట్ల వ్యయంతో నిర్మించిన హుబ్బళ్లిలోని కొత్త ప్లాట్ ఫాం కర్ణాటకలోని ముఖ్యమైన రైల్వే జంక్షన్ అయిన స్టేషన్ లో రద్దీని తగ్గించడానికి, ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.కర్ణాటకలో ముఖ్యమైన కూడలిగా భావించే హుబ్బాయి స్టేషన్ ను వ్యాపార, వాణిజ్యాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది రైలు మార్గాలను బెంగళూరు (దావణగెరె వైపు), హోసపేటే (గదగ్ వైపు), వాస్కో-డ-గామా / బెళగావి (లోండా వైపు) వైపు కలుపుతుంది.

పునరుద్ధరించిన హుబ్బళ్లి ప్లాట్ ఫాం రెండు వైపుల నుండి రైళ్లను పంపడానికి వీలు కల్పిస్తుంది. ప్రధాన నిర్మాణంతో పాటు స్టేషన్ కు మూడో ప్రవేశ ద్వారం కూడా నిర్మించారు. గతంలో ఈ స్టేషన్ కు రెండు ఎంట్రెన్స్, ఎగ్జిట్ ద్వారాలు ఉండేవి. అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హుబ్బళ్లి-దాదర్ ఎక్స్ ప్రెస్, బెళగావి-సికింద్రాబాద్ జంక్షన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను హుబ్బళ్లి ప్లాట్ ఫాంపై నుంచి జెండా ఊపి ప్రారంభించారు.

హుబ్లీ రైల్వే స్టేషన్‌ను అధికారికంగా శ్రీ సిద్ధారూఢ స్వామీజీ స్టేషన్ అని పిలుస్తారు. భవిష్యత్తులో కర్నాటకలోని హుబ్లీ-ధార్వాడ్ ప్రాంతంలో పెరుగుతున్న మరిన్ని రైళ్ల అవసరాన్ని తీర్చడమే ఈ స్టేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాట్‌ఫారమ్ లో ఒకే సారి రెండు దిక్కుల నుంచి రెండు రైళ్లు రాకపోకలు సాగించవచ్చని దక్షిణ రైల్వే తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే