General Bipin Rawat's helicopter crash: ఆర్మీ చాఫ‌ర్ ప్ర‌మాదానికి కారణం ఇదేనా ? శాస్త్రీయ వివ‌ర‌ణ‌..!

By Rajesh KFirst Published Dec 10, 2021, 12:11 PM IST
Highlights

తమిళనాడులోని నీలగిరిలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్ General Bipin Rawat's helicopter crash  కుప్పకూలిన విష‌యం తెలిసిందే. ఈ ఘటన పై అనేక ప్రశ్నలకు తావిస్తోన్నాయి. వీటిలో కొన్నింటికి సమాధానాలు విచారణ తర్వాత మాత్రమే వెల్లడి అవుతాయి, అయితే వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయం ప్ర‌కారం.. ప్ర‌మాదానికి ప్ర‌ధాన కార‌ణం ప్ర‌తికూల  వాతావరణమేన‌ని చెబుతున్నారు.
 

General Bipin Rawat's helicopter crash: భారత ఆర్మీ చర్రితలో విషాద ఘటన చోటుచేసుకుంది. త్రిద‌ళాధిప‌తి బిపిన్ రావత్‌, ఆర్మీ ఉన్నతా ధికారులు, ఇత‌ర సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోవడంపై ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టికే భార‌త వాయుసేన‌ ఈ ప్ర‌మాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది . ఈ ప్ర‌మాదంలో సీడీఎస్‌ జనరల్  బిపిన్ రావత్, ఆయ‌న భార్య మధులిక రావత్‌తో సహా 11 మంది మరణించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. పశ్చిమకనుమల్లోని వాతావరణం లోని మార్పులే ప్రధాన కారణంగా ఉంటుంది. వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేం.
 

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ యొక్క Mi-17 V5 ప్రయాణిస్తున్న సమయంలో నీలగిరి రేంజ్‌లో హెలికాప్టర్ కదలికకు వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని వాతావరణ నిపుణులు  అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ హెలికాప్ట‌ర్ కూలిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌దేన‌ని తెలుస్తోంది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలోకి MI-17 V5 హెలికాప్టర్ ప్ర‌వేశించ‌డంతో .. హెలిక్టాప‌ర్ ఫ్లైయింగ్ సామ‌ర్థ్యం కోల్పోయి.. కూలిపోయిన‌ట్టు అంటున్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో నీల‌గిరి పర్వతం ద్వారా తీవ్రమైన గాలుల వ‌ల్ల‌ కల్లోలం ఏర్పడే ప్రమాదం ఉందని వాత‌వర‌ణ నిపుణుల అభిప్రాయం.

Read Also:   https://telugu.asianetnews.com/national/bodies-of-cds-bipin-rawat-wife-and-others-reach-delhi-pm-narendra-modi-to-pay-tribute-r3uv01

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారిక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. సూలూర్ ఎయిర్ బేస్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు , ఆర్మీ హెలికాప్టర్ MI-17 V5 మ‌ధ్య సంబంధాలు  మధ్యాహ్నం 12:08 గంట‌ల ప్రాంతంలో కోల్పోయింద‌ని తెలిపారు. నీలగిరి శిఖరం సగటు సముద్ర మట్టానికి దాదాపు 2630 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పర్వ‌తానికి ఆగ్నేయ వాలుకు సమీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. 

ట్రోపోస్పియ‌ర్ లో గాలి వేడెక్క‌డంతో గాలి త‌న ప్ర‌సార దిశ‌లో వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. గాలి వేడెక్కుతున్న దృశ్యం కారణంగా, ట్రోపోస్పియర్‌లో నిలువు గాలులు వీస్తున్నాయి. అంటే గాలి పైనుంచి కిందికి వీస్తుంది. అవి మధ్య-ట్రోపోస్పియర్ స్థాయిలో ముఖ్యంగా ప్రమాదకరమైనవి. అంటే వాటి ప్రవాహంలో సమతుల్యత దెబ్బతింటుంది. అంటే గాలులు ప్రతి గంటకు త‌మ వేగాన్ని, దిశ‌ను మార్చుకుంటాయి. దీంతో వాతావ‌ర‌ణ మార్పుల‌ను అంచ‌నా వేయ‌లేం. ట్రోపోస్పియర్ భూమి యొక్క వాతావరణంలో అతి చిన్న భాగం కావడం గమనార్హం.

Read Also: https://telugu.asianetnews.com/international/number-of-journalists-jailed-reached-global-high-in-2021-cpj-report-r3vthx

ప్రమాదం జరిగిన సమయంలో గాలి ఎలా నల్ గ్రూప్ అందించిన గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ డేటాను ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతోంది. 

గాలి ఎలా ఉందో చూడండి..
 
ఉపరితలం నుండి...

గాలి వేగం: 6km/h.. గా ఉంటే..  గాలి దిశ: 90 డిగ్రీలు   850 HPA (భూమి నుండి 1.5 కి.మీ)

గాలి వేగం: 8కిమీ/గం గా ఉంటే.. గాలి దిశ: 70 డిగ్రీలు.. 700 HPA (భూమి నుండి 3.5 కి.మీ)

గాలి వేగం: 6km/h గా ఉంటే.. గాలి దిశ: 140 డిగ్రీలు 500 HPA (భూమి నుండి 5 కి.మీ)

గాలి వేగం: 16కిమీ/గం ఉంటే.. గాలి దిశ: 90 డిగ్రీలు 250 HPA (భూమి నుండి 10.5 కి.మీ)

గాలి వేగం: 40km/h గా ఉంటే.. గాలి దిశ: 245 డిగ్రీలు 70 HPA (భూమికి 17.5 కి.మీ: ట్రోపోపాజ్ స్థాయి)

గాలి వేగం: 32కిమీ/గం గాలి దిశ: 65 డిగ్రీలు ఉన్న‌ట్టు నివేదిక అందించింది. 
 
(భూమి ఉపరితలంపై వాతావ‌ర‌ణం ఒత్తిడిని కలిగిస్తుంది. పీడనాన్ని హెక్టోపాస్కల్స్ (hPa)లో కొలుస్తారు, దీనిని మిల్లీబార్లు అని కూడా పిలుస్తారు)

ఈ డేటా ప్ర‌కారం..  హెలికాప్టర్ ప్ర‌యాణానికి ఏ మాత్రం అనుకూలంగా లేదనే శాస్త్రీయ కారణాల‌తో తెలియజేస్తోన్నారు. ప్రమాద స్థ‌లంలో  గాలి ప్రసరణ 700 hPa ఎత్తులో ఉంది. అంటే.. 0.5 నుండి 2 జౌల్స్/కిలో గాలిని లాగి ఉండేది. జూల్స్ అనేది గాలి యొక్క నిర్దిష్ట శక్తి యొక్క కొలత యూనిట్. సాపేక్ష ఆర్ద్రత 850 hPa స్థాయిలో భూమికి 1.5 కి.మీ ఎత్తులో 90 శాతం ఉంది. అంటే ఎక్కడ గాలి దట్టంగా ఉంటుందో అక్కడ ఎగిరే వస్తువులకు ప్ర‌తికూలంగా ఉంటుంది. అవి ఎగరలేవు.
 

click me!